జడ్డమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠోత్సవాలు ప్రారంభం
ABN , Publish Date - Jun 05 , 2025 | 12:01 AM
రాంపురం పంచాయతీ చిన్నలక్ష్మీపురంలో నూతనంగా నిర్మించిన జడ్డమ్మతల్లి అమ్మ వారి ఆలయ ప్రారంభం, విగ్రహ ప్రతిష్ఠోత్సవాలు బుధవారం ప్రారంభ మయ్యాయి.
నందిగాం, జూన్ 4(ఆంధ్ర జ్యోతి): రాంపురం పంచాయతీ చిన్నలక్ష్మీపురంలో నూతనంగా నిర్మించిన జడ్డమ్మతల్లి అమ్మ వారి ఆలయ ప్రారంభం, విగ్ర హ ప్రతిష్ఠోత్సవాలు బుధవారం ప్రారంభ మయ్యాయి. పురోహి తులు శతపతి ప్రసాదరావు శర్మ, ఇతర రుత్వికుల ఆధ్వర్యంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధన్, మండపారాధన, యాగశాల ప్రవేశం, గ్రామ ప్రదక్షిణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు.
హాలహలేశ్వర స్వామి ఆలయంలో పూజలు
నరసన్నపేట, జూన్ 4(ఆంధ్రజ్యోతి): స్థానిక శ్రీరాంపాడు హలహలేశ్వరస్వామి ఆలయ పునః ప్రారంభోత్సవంలో భాగంగా బుధవారం సత్యవర ఆగ్రహార రుత్వికులు ప్రత్యేక పూజాదికార్యాక్రమాలను నిర్వహించారు. సంకల్పం, మండపారాధన, మహాలింగార్చన, నవగ్రహ జపాలు, పంచశయ్యాధివాసాలు తదితర కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమంలో పలు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
వైభవంగా శాంతి హోమం
జలుమూరు, జూన్ 4(ఆంధ్రజ్యోతి): చిన్నదూగాంలో పాతపట్నం అమ్మవారి విగ్రహ పునః ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా బుధవాం గ్రామస్థులు శాంతి హోమం నిర్వహించారు. గ్రామ పురోహితులు బంకుపల్లి వెంకట అప్పల కృష్ణారావు నేతృత్వంలో గ్రామానికి చెందిన పీస శ్రీనివాసరావు, జ్యోతి దంపతుల ఆధ్వర్యంలో హోమం నిర్వహించారు. గణపతి పూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. లోక కల్యాణార్థం గ్రామస్థులు సహకారంతో శాంతి హోమం నిర్వహించినట్లు పురోహితులు తెలిపారు. పలు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.