Share News

ఇచ్ఛాపురం వరకూ రైల్వేజోన్‌లో కలపాలి

ABN , Publish Date - Jun 09 , 2025 | 12:04 AM

రైల్వేజోన్‌లో ఇచ్ఛాపురం వరకు కలిపి న్యాయం చేయాలని పట్టణానికి చెందిన కె.శంకరరెడ్డితో పాటు యువకులు కోరారు. ఈ

 ఇచ్ఛాపురం వరకూ రైల్వేజోన్‌లో కలపాలి
విప్‌ అశోక్‌కు వినతిపత్రం అందజేస్తున్న ఇచ్ఛాపురం వాసులు:

కవిటి, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): రైల్వేజోన్‌లో ఇచ్ఛాపురం వరకు కలిపి న్యాయం చేయాలని పట్టణానికి చెందిన కె.శంకరరెడ్డితో పాటు యువకులు కోరారు. ఈ మేరకు ఆదివారం రామయ్యపుట్టుగలో ప్రభుత్వ విప్‌ బి.అశోక్‌ను కలిసి వినతిప త్రాన్ని అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖ వరకు జోన్‌ పరిధిని ఇచ్చి జిల్లా వాసులకు తీరని అన్యాయం చేశారన్నారు. జిల్లాలోని రైల్వేస్టేషన్లను కలుపుతూ ఇచ్ఛాపురం వరకూ జోన్‌గా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Jun 09 , 2025 | 12:04 AM