Share News

దేశానికి సేవచేయడం మా అదృష్టం

ABN , Publish Date - Jun 02 , 2025 | 12:04 AM

భారతదేశానికి సేవ చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నామని ఆపరేషన్‌ సిందూర్‌లో పాల్గొన్న సైనికులు పీఎం విజయ్‌, పి.రమేష్‌ అన్నారు.

దేశానికి సేవచేయడం మా అదృష్టం
సైనికులను సత్కరిస్తున్న గ్రామస్థులు

కవిటి, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): భారతదేశానికి సేవ చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నామని ఆపరేషన్‌ సిందూర్‌లో పాల్గొన్న సైనికులు పీఎం విజయ్‌, పి.రమేష్‌ అన్నారు. కవిటి గ్రామానికి చెందిన వీరు సెలవుపై గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంలో ఆదివారం కవిటిలోని అగ్నికులక్షత్రియ సంఘం ఆధ్వర్యంలో మండపం వీధిలో సైనికులను సత్కరించారు. జన్మనిచ్చిన గ్రామం నుంచి వెళ్లి దేశ రక్షణకు తమ వంతు బాధ్యతగా విధులు నిర్వహించామన్నారు. కార్యక్రమంలో కుల పెద్ద పి.లక్ష్మణ మూర్తితోపాటు కులస్థులు, యువకులు పాల్గొన్నారు.

Updated Date - Jun 02 , 2025 | 12:04 AM