Share News

తండ్రి కాదు కాలయముడే

ABN , Publish Date - Oct 26 , 2025 | 12:12 AM

child pregnant కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కాలయముడయ్యాడు. 11 ఏళ్ల కన్నకూతురిపై 54 ఏళ్ల తండ్రి అత్యాచారానికి పాల్పడి గర్భవతిని చేశాడు. గర్భాన్ని తొలగించే యత్నంలో చికిత్స వికటించి ఆ కుమార్తె మృతి చెందింది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలో ఆలస్యంగా ఈ ఘటన వెలుగుచూసింది.

తండ్రి కాదు కాలయముడే

కన్నకూతుర్ని గర్భవతిని చేసిన కామాంధుడు

గర్భం తొలగించే యత్నంలో చికిత్స వికటించి కూతురు మృతి

నిందితుడిపై పోక్సో కేసు నమోదు

నవంబరు 7వరకూ రిమాండ్‌

పాతపట్నం, అక్టోబరు 25(ఆంద్రజ్యోతి): కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కాలయముడయ్యాడు. 11 ఏళ్ల కన్నకూతురిపై 54 ఏళ్ల తండ్రి అత్యాచారానికి పాల్పడి గర్భవతిని చేశాడు. గర్భాన్ని తొలగించే యత్నంలో చికిత్స వికటించి ఆ కుమార్తె మృతి చెందింది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలో ఆలస్యంగా ఈ ఘటన వెలుగుచూసింది. దీనిపై బాధిత బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దర్యాప్తు చేపట్టి నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. కోటబొమ్మాళికి చెందిన ఓ వ్యక్తి.. పాతపట్నం మండలానికి చెందిన ఓ మహిళను కొన్నేళ్ల కిందట రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు 12 ఏళ్ల కుమారుడు, 11 ఏళ్ల కుమార్తె ఉన్నారు. ఈ నలుగురూ హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ఆ వ్యక్తి వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. భార్య కూలి పనులకు వెళ్లేది. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న 11 ఏళ్ల కుమార్తెపై ఆ తండ్రి కన్ను పడింది. వావివరుసలు మరచి.. పైశాచికంగా ప్రవర్తించాడు. ఆ గర్భం దాల్చడంతో దానిని తొలగించే ప్రయత్నాలు చేశాడు. ఈ క్రమంలో ఇటీవల పాతపట్నం తీసుకొచ్చి ప్రైవేటు ఆస్పత్రిలో ఆ చిన్నారి గర్భాన్ని తొలగించాలని కోరగా వైద్యులు నిరాకరించారు. దీంతో ఈనెల 16నశ్రీకాకుళం తరలించి ఓ ఆస్పత్రిలో శస్త్రచికిత్స నిర్వహించగా.. చికిత్స వికటించి ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. వెంటనే మెరుగైన వైద్యం కోసం ఆ కుమార్తె విశాఖపట్నంలో కేజీహెచ్‌కు తరలించగా అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. దీనిపై కేజీహెచ్‌ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఆరా తీయగా తండ్రే.. కుమార్తె గర్భం దాల్చడానికి కారణమని దర్యాప్తు తేలింది. నిందితుడ్ని అదుపులోకి తీసుకుని పాతపట్నం ఎస్‌ఐ కె.మధుసూదనరావు పోక్సో కేసు నమోదు చేశారు. దీనిపై టెక్కలి డీఎస్పీ డి.లక్ష్మణరావు దర్యాప్తు నిర్వహించి నిందితుడ్ని శనివారం కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు నవంబరు 7 వరకూ రిమాండ్‌ విధించిందని సీఐ ఎన్‌.సన్యాసినాయుడు తెలిపారు.

Updated Date - Oct 26 , 2025 | 12:12 AM