ప్రభుత్వంపై బురదచల్లడం తగదు
ABN , Publish Date - Aug 24 , 2025 | 12:19 AM
సంక్షేమం దిశగా రాష్ట్ర ప్రభుత్వం అన్నీ చర్యలు తీసుకొని ముందుకు వెళ్తుంటే ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సిన వైసీపీ మాత్రం బురదచల్లే ప్రయత్నం చేస్తుండడం తగదని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు.
ఎమ్మెల్యే గౌతు శిరీష
పలాస, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): సంక్షేమం దిశగా రాష్ట్ర ప్రభుత్వం అన్నీ చర్యలు తీసుకొని ముందుకు వెళ్తుంటే ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సిన వైసీపీ మాత్రం బురదచల్లే ప్రయత్నం చేస్తుండడం తగదని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. శనివారం మధ్యాహ్నం స్థానిక టీడీపీ కార్యాలయంలో నియో జకవర్గ పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, క్లస్టర్ ఇన్ చార్జీలు, కన్వీనర్లు, ఇతర ముఖ్య నాయకులతో పా ర్టీ సంస్థాగత ఎన్నికలపై సమీక్షించారు. ఈ సంద ర్భంగా శిరీష మాట్లాడుతూ.. సూపర్‌సిక్స్ కార్యక్ర మాలు సూపర్‌హిట్ కావడంతో వైసీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఏదో ఒక విధంగా బురదచల్లి రాజకీయ లబ్ధి పొందా లనుకునేవారికి ఇప్పటికే ప్రజలు బుద్ధి చెప్పారని, ఇదేవిధానం కొనసాగితే వారికి శాశ్వతంగా స్వస్తి చెబుతారన్నారు. వికలాంగుల పింఛన్ల వ్యవహా రంలో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయడాన్ని ఇప్పటికే అంతా గుర్తించారని, వారివి ఫేక్ అని తేలిపోయిందన్నారు. వర్షాలు వస్తే అమ రావతి మునిగిపోయిందని, ఉచితంగా మహిళలకు బస్సు సౌకర్యం కల్పిస్తే దానిపై కల్పితాలు అల్లా రని వారు ఏనాడయినా నిజం ప్రజలకు చెప్పారా అని ప్రశ్నించారు. పలాస నియోజకవర్గం సర్వతో ముఖాభివృద్ధికి అంతా సహకారం అందించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో వజ్జ బాబూరావు, లొడగల కామేశ్వరరావుయాదవ్, మల్లా శ్రీనివాస్, బడ్డ నాగరాజు, గాలి కృష్ణారావు, సప్ప నవీన్, గురిటి సూర్యనారాయణ, టంకాల రవిశంకర్‌గుప్తా, జోగ మల్లి పాల్గొన్నారు.