Share News

చంద్రబాబు పాలనలో ఐటీ అభివృద్ధి

ABN , Publish Date - Oct 16 , 2025 | 12:09 AM

సీఎం చంద్రబాబు పాల నతో రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధి దిశగా పయనిస్తోందని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌ అన్నారు.

చంద్రబాబు పాలనలో ఐటీ అభివృద్ధి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే బెందాళం అశోక్‌

  • ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌

కవిటి, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు పాల నతో రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధి దిశగా పయనిస్తోందని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌ అన్నారు. రామయ్య పుట్టుగలో బుధవారం విలేకరులతో మాటాడుతూ.. విశాఖలో గూగుల్‌ సంస్థ ఏర్పాటుకు నిర్ణయించడంతో యువతకు మేలు జరుగుతుందన్నారు. విశాఖ ఏఐ సిటీగా మారితే రాష్ట్రం దేశా నికే డిజిటల్‌ ఇండియాలో మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. విశాఖ కేంద్రంగా ఐటీ అభివృద్ధికి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ విశేషంగా కృషి చేస్తున్నారన్నారు. కార్య క్రమంలో టీడీపీ నేత బి.రమేష్‌, మత్స్యకార ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Oct 16 , 2025 | 12:09 AM