పరిశుభ్రత ఇలాగేనా?
ABN , Publish Date - Sep 02 , 2025 | 12:13 AM
పరిశుభ్రత ఇలాగేనా ఉంచేది.. ఎటు చూసినా చెత్తాచెదారం ఉంటే ఎలా అంటూ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ టెక్కలి మేజర్ పంచాయతీ ఈవో ఏవీ శ్రీనివాస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
టెక్కలిలో అపరిశుభ్రతపై కలెక్టర్ ఆగ్రహం
శానిటేషన్ మేస్త్రీని తొలగించాలని ఆదేశాలు
టెక్కలి, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): పరిశుభ్రత ఇలాగేనా ఉంచేది.. ఎటు చూసినా చెత్తాచెదారం ఉంటే ఎలా అంటూ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ టెక్కలి మేజర్ పంచాయతీ ఈవో ఏవీ శ్రీనివాస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మధ్యాహ్నం ఎన్టీఆర్ కాలనీలో పర్యటించిన కలెక్టర్ ఎక్కడిపడితే అక్కడే చెత్త చెదారం కనిపించడంతో మండిపడ్డారు. ఎన్నాళ్ల నుంచి చెత్త తొలగించడం లేదని శాని టేషన్ మేస్త్రీ అప్పన్నపై మండపడ్డారు. ఆదివారం కావడంతో చెత్త తొలగించ లేదని శానిటేషన్ మేస్త్రీ బదులివ్వగా.. అక్కడున్న పాల ప్యాకెట్ల కవరుపై ఆగ స్టు 17వ తేదీ ఉండడాన్ని గమనించి మరింత మండిపడ్డారు. వెంటనే శానిటేష న్ మేస్త్రీ అప్పన్నను తొలగించాలని ఆదేశించారు. పరిశుభ్రత నెలకొల్పేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, అందుకు 73 పాయింట్లను కూడా గుర్తించామని, దానికి అనుమతి రావాల్సి ఉందని కార్యదర్శి ఏవీ శ్రీనివాస్ చె ప్పగా.. పంచాయతీ యంత్రాంగం జాప్యం చేస్తున్నారంటూ కలెక్టర్ మరింత విరుచుకుపడ్డారు. ఇదేనా పారిశుధ్య నిర్మూలనకు చర్యలు, ఇలాగేనా పారిశు ధ్యం ఉండేది అంటూ పంచాయతీ సిబ్బందిపై విరుచుకుపడ్డారు. తక్షణమే పారిశుధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు. కలెక్టర్‌తో పాటు ట్రైనీ కలెక్టర్ పృధ్వీరాజ్, ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. కాగా సోమవారం సాయంత్రం జిల్లా పంచాయతీ అధికారి భారతీ సౌజన్య టెక్కలి గ్రామ పంచా యతీ యంత్రాంగంతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. టెక్కలిలో అపరిశుభ్రతపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపట్టాలని ఈవోపీఆర్డీ సింహాద్రిని ఆదేశించారు.