Share News

సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలి

ABN , Publish Date - May 07 , 2025 | 11:41 PM

జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి కె.మోహనరావు, కౌలు రైతు సంఘం అధ్యక్షుడు వెలమల రమణ డిమాండ్‌ చేశారు.

 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలి
ధర్నా చేస్తున్న రైతుసంఘ నాయకులు

-కలెక్టరేట్‌ వద్ద రైతు సంఘ నాయకుల ధర్నా

శ్రీకాకుళం కలెక్టరేట్‌, మే 7(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి కె.మోహనరావు, కౌలు రైతు సంఘం అధ్యక్షుడు వెలమల రమణ డిమాండ్‌ చేశారు. బుధవారం కలెక్టరేట్‌ వద్ద నిర్వహించిన ధర్నాలో వారు మాట్లాడారు. జిల్లాలో వంశధార, నాగావళి, మహేంద్రతనయ, బాహుదా వంటి జీవనదులు, మరెన్నొ గెడ్డలు, వాగులు ఉన్నా నీరు వృథాగా సముద్రంలో కలిసిపోతుందన్నారు. నారాయణపురం ప్రాజెక్టు కూడా రైతులకు సాగునీరు అందించడం లేదన్నారు. ప్రాజెక్టులను పూర్తిచేసి, శివారు భూములకు నీరందించాలని, వలసలను నివారించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ధర్నా అనంతరం కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు పి.చంద్రరావు, నాయకు లు కె.కొండయ్య, బి.వాసు. ఎం.అజయ్‌, ముద్దాడ రమణ, రుప్ప ఆదినారాయణ, జె.కృష్ణారావు, అల్లు సూర్యనారాయణ, ఎన్‌.రంగారావు, నీలం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 07 , 2025 | 11:41 PM