రైతులకు సాగునీరందేలా చర్యలు
ABN , Publish Date - Oct 17 , 2025 | 11:55 PM
రైతులకు పూర్తి స్థాయిలో సాగునీరందేలా చర్యలు తీసుకోనున్నట్లు ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు.
జి.సిగడాం, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరందేలా చర్యలు తీసుకోను న్నట్లు ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు. దేవరవలస గ్రామ సమీపంలో మడ్డు వలస కుడి ప్రధాన కాలువను శుక్రవారం పరిశీలించారు. 70 అడుగుల లోతులో కాలువ ఉండటంతో సాగునీరు అంద డం లేదని గ్రామ పెద్దలు, రైతులు ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు. పూర్తిస్ధాయిలో కాలువను పరిశీలించిన అనంతరం సంబంధిత అధికారులు, మంత్రుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటా నన్నారు. ఆయన వెంట నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి విశ్వక్సేన్, ఉమ్మడి జిల్లా జనసేన కార్యదర్శి తాలాబత్తుల పైడిరాజు, టీడీపీ, జనసేన మండల అధ్యక్షులు కుమరాపు రవికుమార్, మీసాల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
జనసేన కార్యాలయం సందర్శన
లావేరు, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): లావేరు సమీపంలో నిర్మిస్తున్న జనసేన ప్రాంతీయ కార్యాలయాన్ని ఎమ్మెల్సీ కె. నాగబాబు శుక్రవారం పరిశీలించారు. త్వరలో కార్యాలయాన్ని ప్రారంభించి ప్రజలకు, జనసేన కార్యకర్తలకు అందుబాటులో ఉంచతామన్నారు. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.