Share News

accupation : పంట కాలువ పూడ్చివేత

ABN , Publish Date - May 10 , 2025 | 11:48 PM

Canal encroachment ఆమదాలవలస మండలం బొబ్బిలిపేటలో సుమారు 150 ఎకరాలకు సాగునీరు అందిస్తున్న కాలువను కొంతమంది వ్యక్తులు మట్టితో పూడ్చేశారు. దీనిపై ఇటీవల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామానికి చెందిన రైతు మెట్ట శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.

accupation : పంట కాలువ పూడ్చివేత
పంట కాలువకు అడ్డంగా వేసిన మట్టి

  • ఫిర్యాదు చేసినా పట్టని అధికారులు

  • ఆందోళనలో రైతులు

  • ఆమదాలవలస, మే 10(ఆంధ్రజ్యోతి): ఆమదాలవలస మండలం బొబ్బిలిపేటలో సుమారు 150 ఎకరాలకు సాగునీరు అందిస్తున్న కాలువను కొంతమంది వ్యక్తులు మట్టితో పూడ్చేశారు. దీనిపై ఇటీవల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామానికి చెందిన రైతు మెట్ట శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘బొబ్బిలిపేటలో బాగమ్మ చెరువు నుంచి కాలువ ద్వారా 70 మంది రైతుల పొలాలకు సాగునీరు అందేది. ప్రభుత్వం ఇటీవల రూ.8లక్షలతో పక్కాగా సిమెంట్‌తో ఆ కాలువ నిర్మాణ పనులు చేపట్టింది. కొన్నాళ్ల కిందట గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఆ సిమెంట్‌ కాలువలో ట్రాక్టర్లతో మట్టిని వేసి పూడ్చేసి ఆక్రమించారు. దీనిపై కాలువ ఆయకట్టు రైతులతో కలిసి ఆమదాలవలస తహసీల్దార్‌ కార్యాలయంలో నెలరోజుల కిందట ఫిర్యాదు చేసినా.. నేటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మరికొద్ది రోజుల్లో ఖరీఫ్‌ సాగు పనులు ప్రారంభించాల్సి ఉంది. కాలువ ద్వారా నీరు అందకపోతే సాగు ఎలా చేయాలో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోతే.. భవిష్యత్తులో గ్రామం చుట్టూ ఉన్న అన్ని సాగునీటి కాలువలు కూడా ఆ క్రమణలకు గురయ్యే ప్రమాదం ఉంద’ని శ్రీనివాసరావు తెలిపారు. ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయమై తహసీల్దార్‌ రాంబాబు వద్ద ప్రస్తావించగా.. కాలువ ఆక్రమించిన వ్యక్తులకు నోటీసులు జారీ చేశామన్నారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - May 10 , 2025 | 11:48 PM