జగతిమెట్ట ఇళ్ల కాలనీల్లో అక్రమాలు
ABN , Publish Date - May 30 , 2025 | 11:50 PM
జగతిమెట్ట ఇళ్ల కాలనీల్లో రెవెన్యూ సిబ్బంది తప్పిదాలతో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు గుర్తించామని ఆర్డీవో ఎం.కృష్ణ మూర్తి తెలిపారు.
టెక్కలి, మే 30(ఆంధ్రజ్యోతి): జగతిమెట్ట ఇళ్ల కాలనీల్లో రెవెన్యూ సిబ్బంది తప్పిదాలతో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు గుర్తించామని ఆర్డీవో ఎం.కృష్ణ మూర్తి తెలిపారు. శుక్రవారం రాత్రి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అక్ర మాల చిట్టాను వివరించారు. ఈ కాలనీకి సంబంధిం చి పత్రికల్లో వస్తున్న కథనాలపై మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, రెవెన్యూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు లోతుగా దర్యాప్తు కొనసాగించామన్నారు. టెక్కలి తహసీల్దార్ కార్యాలయంలో అంతులేని తప్పిదాలు జరిగినట్టు గుర్తించామన్నారు. దీనికి బాధ్యులైన ఇద్దరు తహసీల్దార్లు, ఒక ఉప తహసీల్దార్, ఒక ఆర్‌ఐ, ఒక సర్వేయర్, ముగ్గురు వీఆర్వోలు, ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్‌పై చర్యలకు కలెక్టర్‌కు సిఫారసు చేసినట్లు చెప్పారు. వీరిపై క్రిమినల్ కేసులకు కూడా వెనుకాడ బోమని స్పష్టం చేశారు. ఇళ్ల కాలనీకి సంబంధించి తహసీల్దార్ కార్యాలయంలో ఒక్క రికార్డు కూడా లేద ని తెలిపారు. ఇళ్ల పట్టాలు జారీ చేసినప్పుడు పంపిణీ రికార్డు, లబ్ధిదారుల వివరాలు, ఎక్కడెక్కడ కేటాయిం పులు జరిగాయి, లేఅవుట్ వివరాలు తెలిపే రికార్డులు లభించలేదని తెలిపారు.
అక్రమంగా చెల్లింపులు
ఇళ్ల కాలనీకి సంబంధించి వాస్తవానికి 30 మంది రైతులకు సంబంధించిన డి.పట్టా భూములను ప్రభు త్వం సేకరించిందన్నారు. కానీ అప్పటి రెవెన్యూ అధికా రులు 70 మంది రైతుల నుంచి డి.పట్టా భూములు తీసుకున్నట్లు రికార్డులు చూ పారన్నారు. వీరిలో 56 మందికి చెల్లింపులు చేశారని తెలిపారు. ఇందులో ఒక ఆర్డీవో, తహసీల్దార్ స్థాయి అధికారులు, ఒక మండల సర్వేయర్, ఒక విలేజ్ సర్వేయర్, ఒక వీఆర్‌వో తప్పి దాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. వీరిలో కొంత మంది రెవెన్యూ అధికారులు 40 మందికి అదనంగా అనధికార పట్టాలు మంజూరు చేశారని తెలి పారు. 16 ఖాళీ స్థలాలు, 14 పునాదులతో ఉన్న స్థలాలను ప్రభుత్వం స్వాధీనం చేసు కుంటుందని చెప్పారు. వాస్తవానికి డి.పట్టా ఉన్న రైతులకు ఒక్కో ఇంటి పట్టా జారీ చేయాలన్నారు. కానీ అప్పటి రెవెన్యూ అధికారు లు గుంట బాబూరావు పేరున ఆరు పట్టాలు, మట్ట ప్రభాకర్ పేరున మూడు పట్టాలను నిబంధనలకు విరుద్ధంగా జారీ చేసినట్లు గుర్తించామన్నారు. ఇలా డి.పట్టా భూములు లేని 23మంది రైతులను గుర్తిం చామని తెలిపారు. డి.పట్టాలు ఇచ్చిన రైతులకు నవ రత్నాలు కోటాలో మ్యాపింగ్ చేయాల్సి ఉండగా, 23మంది వివరాలే లేవని తెలిపారు.
ఫోర్జరీ సంతకాలతో...
ఇక జగతిమెట్ట ఇళ్ల కాలనీలో ఆన్‌లైన్‌లో 306 మంది డేటా కనిపించిందని... అందులో 12మంది ఇళ్ల నిర్మాణం చేపట్టలేదన్నారు. 132 మంది ఇళ్లు పునాది స్థాయిలో ఉన్నాయని.. 104 మంది ఇళ్లు కట్టుకున్నారని, శ్లాబ్ లెవల్‌లో 58 ఉన్నట్లు తెలిపారు. పునాది స్థాయిలోని 132 మందిలో ఇతరులకు విక్రయించిన వారే ఎక్కు వగా ఉన్నట్లు పరిశీలనలో తేలిందన్నారు. తహసీల్దార్ ఫోర్జరీ సంతకాలతో ఫేక్ పట్టాలు చాలామంది వద్ద ఉన్నట్లు గుర్తించామన్నారు. ఏకంగా ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్ పట్టా ఒక దగ్గర, మ్యాపింగ్ మరో దగ్గర చేశాడని తెలిపారు. ఇలా ఎన్నో చోట్ల ఈ తరహా అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించామన్నారు. సుమారు 190 వరకు ఇళ్ల పట్టాలు రద్దు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా... 2019కి ముందు ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకొని ఇళ్లు నిర్మించుకున్న వారికి రెగ్యుల రైజేషన్‌కు డిసెం బరు 31 వరకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని ఆర్డీవో కృష్ణమూర్తి తెలిపారు.