Share News

ఆహ్వాన నాటిక పోటీలు ప్రారంభం

ABN , Publish Date - Dec 06 , 2025 | 12:23 AM

శ్రీకాకుళం రంగస్థల కళాకారుల సమాఖ్య నెలవారీ సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు శుక్రవారం స్థానిక బాపూజీ కళామందిరంలో ప్రారంభమయ్యాయి.

ఆహ్వాన నాటిక పోటీలు ప్రారంభం
‘అందరూ మంచివారే కానీ’ నాటికలో ఓ దృశ్యం

పాత శ్రీకాకుళం, డిసెంబరు5 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం రంగస్థల కళాకారుల సమాఖ్య నెలవారీ సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు శుక్రవారం స్థానిక బాపూజీ కళామందిరంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్‌ మాట్లాడుతూ.. 314 నెలలుగా నిరంతరం కార్యక్రమాలు నిర్వహిం చడం అభినందనీయమన్నారు. పేద కళాకారులకు పెన్షన్‌ ఇచ్చేందుకు కృషి చేస్తానన్నారు. రిటైర్డ్‌ ఆర్డీవో పీఎంజే బాబు మాట్లా డుతూ.. కళాకా రుల చేపడుతున్న కార్యక్రమాలను ప్రశంశించారు. ఎల్‌.సూర్యలింగం- లక్ష్మీనరసమ్మ దంపతులు ఙ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో మడ్లపాడు మానవతా నాటక సంస్థ ప్రదర్శించిన ‘అందరూ మంచివారే కానీ’ నాటిక ఆలోచింపజేసింది. శనివారం అమ్మ చెక్కిన బొమ్మ, ఎవరు నాటికలు ప్రదర్శించనట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో గొండు స్వాతి, నిర్వాహకులు చిట్టి నాగభూషణం, ఎల్‌.రామలింగస్వామి, పన్నాల నరసింహ మూర్తి, రామచంద్రదేవ్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 06 , 2025 | 12:23 AM