Share News

బాలింతల మృతిపై విచారణ

ABN , Publish Date - Jul 13 , 2025 | 12:05 AM

బుడితి సామాజిక ఆసుపత్రిలో ఇద్దరు బాలింతలు మృతి చెందడంపై జిల్లా ప్రత్యేక వైద్యుల బృందం శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించింది.

బాలింతల మృతిపై విచారణ
వైద్యాధికారులను విచారిస్తున్న ప్రత్యేక బృందం

  • ఐదుగురితో కూడిన వైద్య బృందం బుడితి సీహెచ్‌సీ పరిశీలన

జలుమూరు(సారవకోట), జూలై 12(ఆంధ్రజ్యోతి): బుడితి సామాజిక ఆసుపత్రిలో ఇద్దరు బాలింతలు మృతి చెందడంపై జిల్లా ప్రత్యేక వైద్యుల బృందం శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. టెక్కలి ఆసుపత్రిలో పనిచేస్తున్న జి.ప్రసునాంబ, వి.ప్రకాష్‌వర్మ, ఎం.పెస్థిబ చైతన్య, నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఎస్‌.శ్రీనుబాబు, జె.కాళీచరణ్‌తో కూడిన ఐదుగురు ప్రత్యేక వైద్య బృందం విచారణ చేపట్టారు. ఈనెల 7న ముగ్గురు గర్భిణులకు సిజేరియన్‌ చేయగా.. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో 8వ తేదీ రాత్రి శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రి (రిమ్స్‌)కి రిఫర్‌ చేయగా.. చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం విదితమే. అయితే వీరి మృతికి కారణాలపై దర్యాప్తు నిర్వహించారు. గర్భిణులకు శస్త్ర చికి త్స చేసిన రోజున ఎవ రెవరు వైద్యులు ఉన్నారు.. ఎటువంటి మందులు అందించారు. వంటి అంశా లపై ఆరా తీశారు. పూర్తిస్థాయిలో నివేదికను తయారుచేసి జిల్లా సామాజిక ఆసుపత్రుల సమన్వయాధికారికి, కలెక్టర్‌కు నివేదించనున్నట్టు బృందం పేర్కొంది.

Updated Date - Jul 13 , 2025 | 12:05 AM