ప్రభుత్వ స్థలం ఆక్రమణపై విచారణ
ABN , Publish Date - Sep 18 , 2025 | 11:46 PM
మండలంలోని పెద్ద కొజ్జిరియా సమీపంలోని జాతీయరహదారికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కొంతమంది ఆక్రమించారన్న సమాచారం మేరకు గురువారం రెవెన్యూ అధికారులు పరిశీలిం చారు. జాడుపుడి సమీపంలో కొందరి వ్యక్తులకు సుమారు ఆరు ఎకరాల స్థలం ఉండగా, మధ్యలో ప్రభుత్వ గోర్జిగా పిలువబడే 62 సెంట్ల స్థలంఉంది. ఇటీవల ఆ స్థల యజమానులు వెంచర్లుగా మార్చేందుకు సిద్ధమయ్యారు.
కంచిలి, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పెద్ద కొజ్జిరియా సమీపంలోని జాతీయరహదారికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కొంతమంది ఆక్రమించారన్న సమాచారం మేరకు గురువారం రెవెన్యూ అధికారులు పరిశీలిం చారు. జాడుపుడి సమీపంలో కొందరి వ్యక్తులకు సుమారు ఆరు ఎకరాల స్థలం ఉండగా, మధ్యలో ప్రభుత్వ గోర్జిగా పిలువబడే 62 సెంట్ల స్థలంఉంది. ఇటీవల ఆ స్థల యజమానులు వెంచర్లుగా మార్చేందుకు సిద్ధమయ్యారు. ఈక్రమంలో తమ భూమితోపాటు ప్రభుత్వ గోర్జిని సైతం చదును చేశారు. దీన్ని గమనించిన పలువురు ఈ విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో తహసీల్దార్ ఎన్.రమేష్ కుమార్, ఆర్‌ఐ కృష్ణ చంద్రరౌళో, సిబ్బందితో కలిపి విచా రణ నిర్వహించారు. ప్రభుత్వానికి చెందిన భూమిని సైతం చదును చేసినట్లు గుర్తించారు. దీంతో ప్రభుత్వభూమికి హద్దులు నిర్ణయించి, దీనికి కారణమైన వ్యక్తులకు వివరణ కోరినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు తహసీల్దార్‌కు విన్నవించారు.
చెరువులను ఆక్రమిస్తే చర్యలు
ఆమదాలవలస, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): చెరువులను ఎవరైనా ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని శ్రీకాకుళం తహసీల్దార్ ఎస్.గణపతి హెచ్చరించారు. గురువారం శ్రీకాకుళం రూరల్ మండలంలోని,ఆమదాలవలస మునిసిపాలిటీ ఆరో వార్డు పరిధిలోని కె.మన్యయ్యపేటలోని చొక్కాకులబందతోపాటు చెరువులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చెరువులను ఆక్రమిస్తున్నట్లు పలు ఫిర్యాదులు అందాయని, సర్వేచేసి ఆక్రమణలు తొలగిస్తామని తెలిపారు. గతంలో చొక్కాకుల బంద చెరువు ఆక్రమణలు తొలగించామని, ఇంకా ఉంటే తొలగి స్తామని చెప్పారు.