కంకర వ్యవహారంపై దర్యాప్తు చేయండి: ఎమ్మెల్యే శిరీష
ABN , Publish Date - Jun 14 , 2025 | 12:15 AM
మందస మండలం నల్లబొడ్లూరు కొండపై అక్రమంగా కంకరను తవ్వుకొని కొండంతా వైసీపీ నాయకులు కొట్టేశారని దీనిపై లోతుగా దర్యాప్తు చేసి దోషు లకు శిక్ష పడేవిధంగా చర్యలు తీసుకోవాలని మైనింగ్ శాఖ కార్యదర్శి ప్రవీణ్‌కు ఎమ్మెల్యే గౌతు శిరీష కోరారు.
పలాస, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): మందస మండలం నల్లబొడ్లూరు కొండపై అక్రమంగా కంకరను తవ్వుకొని కొండంతా వైసీపీ నాయకులు కొట్టేశారని దీనిపై లోతుగా దర్యాప్తు చేసి దోషు లకు శిక్ష పడేవిధంగా చర్యలు తీసుకోవాలని మైనింగ్ శాఖ కార్యదర్శి ప్రవీణ్‌కు ఎమ్మెల్యే గౌతు శిరీష కోరారు. ఈ మేరకు సచివాలయంలో శుక్రవారం కలుసుకొని వినతి పత్రం అందించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బరి తెగించిన నాయకులు నల్లబొడ్లూరు కొండ మొత్తం 9 ఎకరాల్లో అక్రమంగా తవ్వకాలు చేసి కంకరంతా అమ్ముకున్నారని ఆరోపించారు. దీనిపై సహ చట్టం ద్వారా మొత్తం వివరాలు సేకరించి ప్రభుత్వానికి ఫిర్యాదు చేశామని ఎమ్మెల్యే శిరీష తెలిపారు. దీనిపై స్థానికంగా ఉన ్న సర్పంచ్‌కు నోటీసులు ఇవ్వడమే కాకుండా రూ.4 కోట్ల వరకూ అపరాధ రుసుం విధించారని తెలిపారు. చట్టంలో ఉన్న చిన్నచిన్న లొసుగుల ఆధారంగా తాత్కాలికంగా కోర్టు నుంచి స్టే తెచ్చారని, ఈ విషయంలో లోతుగా దర్యాప్తు నిర్వహించి కోర్టు ముందు వారు చేసిన తప్పులు వివరించాలని కోరారు. తాత్కాలికంగా ఆ దోషులు బయట ఉండగలరేమో గాని త్వరలోనే శిక్ష అనుభవించి తీరుతారనడంలో ఎటువంటి సందేహం లేదని శిరీష పేర్కొన్నారు.