మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
ABN , Publish Date - Dec 21 , 2025 | 12:17 AM
ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాల కు దూరంగా ఉండాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు.
జలుమూరు, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాల కు దూరంగా ఉండాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. పాయకరావుపేట నుంచి ఇచ్ఛాపురం వరకు చేపట్టిన అభ్యుదయ సైకిల్ యాత్రకు శనివారం చల్లవానిపేట కూడలిలో ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా స్థానిక ఓ కల్యాణ మండపంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మత్తు పదార్థాల వినియోగానికి ప్రజలు దూరంగా ఉండాలని అవగాహన కల్పించేందుకు ఈ యాత్ర గొప్ప సామాజిక ఉద్యమమని కొనియాడారు. అనంతరం అభ్యుదయ సైకిల్ యాత్రలో పాల్గొన్న వారిని ఘనంగా సత్కరించారు. ముందుగా చల్లవానిపేట కూడలిలో మానవహారం ఏర్పాటు చేసి మత్తు పదార్ధాలు వాడకం వలన కలిగే నష్టాలను వివరించారు. కార్యక్రమంలో నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త బగ్గు అర్చన, ఎంపీడీవో బి.చిన్నమ్మడు, ఎస్‌ఐ బి.అశోక్‌బాబు, పార్టీ నాయకులు వెలమల రాజేంద్రనాయుడు, బగ్గు గోవిందరావు, దుంగ స్వామిబాబు, చంద్రభూషణరావు, బలరాం పాల్గొన్నారు.