Share News

అంతర్‌ రాష్ట్ర గంజాయి స్మగ్లర్లు అరెస్టు

ABN , Publish Date - Sep 09 , 2025 | 12:27 AM

గంజాయి రవాణా చేస్తు న్న ముగ్గురు అంతర్‌ రాష్ట్ర ముఠాను కాశీబు గ్గ పోలీసులు ఆదివారం రాత్రి పలాస రైల్వే స్టేషన్‌ వద్ద పట్టుకున్నారు.

అంతర్‌ రాష్ట్ర గంజాయి స్మగ్లర్లు అరెస్టు

  • వేర్వేరు కేసుల్లో పట్టుబడిన ముగ్గురు

  • కాశీబుగ్గ డీఎస్పీ వెంకట అప్పారావు

పలాస, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): గంజాయి రవాణా చేస్తు న్న ముగ్గురు అంతర్‌ రాష్ట్ర ముఠాను కాశీబు గ్గ పోలీసులు ఆదివారం రాత్రి పలాస రైల్వే స్టేషన్‌ వద్ద పట్టుకున్నారు. రెండు వేర్వేరు కేసులకు సంబంధించి మొత్తం రూ.1.20 లక్షల విలువైన ఎనిమిది కిలోల గంజాయి స్వాధీ నం చేసుకున్నారు. వీరిని సోమవారం పలాస కోర్టులో హాజరుపరిచినట్టు కాశీబు గ్గ డీఎస్పీ వి.వెంకట అప్పారావు తెలిపారు. స్థానిక పోలీసు స్టేషన్‌లో ఆయన వి లేకరులతో మాట్లాడారు. ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడి పట్టణానికి చెందిన సుస్థీర్‌ మాలి, రాయఘడ జిల్లా చంపాపూర్‌ గ్రామానికి చెందిన కిశోర్‌ చంద్రఖర్జీ, కేరళ రాష్ట్రానికి చెందిన ఫైజల్‌.. గతంలో వీరు ముగ్గురు కేరళలోని ఓ హోటల్‌లో పని చేస్తూ పరిచయం అయ్యారు. కిశోర్‌ చంద్రఖర్జీ గంజాయి పండిస్తూ వివిధ మా ర్గాల ద్వారా బ్రోకర్లకు చేరదీస్తుంటారు. ఈ క్రమంలో ఫైజల్‌కు గంజాయిని ఇ వ్వాలని సుస్థీర్‌మాలికి చెప్పారు. నెల్లూరు రైల్వేస్టేషన్‌ వద్ద ఆయన ఉంటాడని చెప్పడంతో రెండు కిలోల గంజాయిని ప్యాకెట్‌గా చేసుకొని సుస్థీర్‌మాలి పలాస రైల్వే స్టేషన్‌కు చేరుకోగా, సిబ్బందితో తనిఖీలు చేస్తున్న కాశీబుగ్గ ఎస్‌ఐ నర్సిం హమూర్తికి పట్టుబడ్డాడు. ఆయన నుంచి సెల్‌ఫోన్‌, రూ.2,850 స్వాధీనం చేసుకు న్నారు. అలాగే నెల్లూరు జిల్లా బుజబూజ గ్రామానికి చెందిన సయ్యద్‌ సుల్తాన్‌, బిడిపూడి అరుణ్‌కుమార్‌ ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడి పట్టణానికి చెందిన షేక్‌ గఫూర్‌ వద్ద ఆరు కిలోల గంజాయి కొనుగోలు చేసుకొని తమిళనాడు రాష్ట్రం రా మాపురం గ్రామానికి చెందిన విషిత్రాదేవికి గంజాయి ఇచ్చేందుకు పలాస రైల్వే స్టేషన్‌కు ఆదివారం రాత్రి చేరుకున్నారు. ఆ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న కాశీబుగ్గ ఎస్‌ఐ నర్సింహమూర్తి ఆధ్వర్యంలో సిబ్బంది వారిని తనిఖీ చేస్తూ గం జాయిని గుర్తించారు. దీంతో వారిని అరెస్టు చేసి, సెల్‌ఫోన్‌, రూ.1020 స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరుపరిచారు. వీరు కూడా తమిళనాడులోని ఓ హోటల్‌లో పనిచేస్తూ పరిచయం అయ్యారు. సీఐ పి.సూర్యనారాయణ, సిబ్బంది ఉన్నారు.

Updated Date - Sep 09 , 2025 | 12:27 AM