Share News

పట్టుబడిన అంతర్రాష్ట్ర గంజాయి ముఠా

ABN , Publish Date - Sep 12 , 2025 | 12:28 AM

గంజాయితో అంత ర్రాష్ట్ర ముఠా పట్టుబ డిందని కాశీబుగ్గ డీ ఎస్పీ వెంకట అప్పా రావు తెలిపారు.

పట్టుబడిన అంతర్రాష్ట్ర గంజాయి ముఠా
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ వెంకట అప్పారావు

  • 10.6 కిలోలతో ఇద్దరి అరెస్టు

  • డీఎస్పీ వెంకట అప్పారావు

పలాస, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): గంజాయితో అంత ర్రాష్ట్ర ముఠా పట్టుబ డిందని కాశీబుగ్గ డీ ఎస్పీ వెంకట అప్పా రావు తెలిపారు. స్థాని క పోలీసు స్టేషన్‌లో గురువారం ఆయన ఇందుకు సంబంధిం చిన వివరాలను వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం అర్గుపూర్‌ గ్రామానికి చెందిన రోహిత్‌, యశ్వా స్‌ గ్రామానికి చెందిన నూరుద్దీన్‌ స్నేహితులు. గంజాయి స్మగ్లింగ్‌ ద్వారా సుల భంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో ఈ అక్రమ మార్గాన్ని ఎంచుకున్నా రు. ఈ క్రమంలో వీరు ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడికి చెందిన సుమన్‌ మాలిక్‌ వద్ద 10.6 కిలోల గంజాయి కొనుగోలు చేసి బుధవారం రాత్రి పలాస రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. దీనిని కేరళ రాష్ట్రం తవనూర్‌ గ్రామానికి చెందిన టి.ఆస్కార్‌కి అం దించేందుకు వీరు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇదే సమయంలో పలాస రైల్వే స్టేషన్‌ రోడ్డులో కాశీబుగ్గ ఎస్‌ఐ నర్సింహమూర్తి తన సిబ్బందితో తనిఖీలు నిర్వ హిస్తున్నారు. వీరిపై అనుమానం రావడంతో వారి బ్యాగులు తనిఖీ చేయగా.. గం జాయి ఉన్నట్టు గుర్తించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారించా రు. గతంలో కూడా వీరిపై గంజాయి రవాణా కేసులు ఉన్నాయన్నారు. ఈ కేసు లో మొత్తం నలుగురిపై కేసు నమోదు చేసి ఇద్దర్ని అరెస్టు చేసినట్టు తెలిపారు. ఈగల్‌ టీమ్‌లు ఏర్పాటు చేసిన తర్వాత గంజాయిపై పూర్తి నిఘా పెట్టామని డీఎస్పీ అన్నారు. ఒడిశా సరిహద్దు గొప్పిలి, వసుంధర, ఇచ్ఛాపురం వద్ద చెక్‌పో స్టులు ఏర్పాటు చేసి నిఘా ఉంచామన్నారు. సమావేశంలో ఎస్‌ఐ నర్సింహ మూర్తి, సిబ్బంది ఉన్నారు.

Updated Date - Sep 12 , 2025 | 12:28 AM