అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్టు
ABN , Publish Date - Oct 28 , 2025 | 12:31 AM
Three thieves arrested శ్రీకాకుళం రూరల్, గార పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆరు ఇళ్లల్లో జరిగిన దొంగతనం కేసుల్లో 186 గ్రాముల బంగారం, 263 గ్రాముల వెండి ఆభరణాలను శ్రీకాకుళం రూరల్ పోలీసులు రికవరీ చేశారు. అం తర్ జిల్లాకు చెందిన ముగ్గురిని అరెస్టు చేశారు.
186 గ్రాముల బంగారం, 263 గ్రాముల వెండి స్వాధీనం
శ్రీకాకుళం క్రైం, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం రూరల్, గార పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆరు ఇళ్లల్లో జరిగిన దొంగతనం కేసుల్లో 186 గ్రాముల బంగారం, 263 గ్రాముల వెండి ఆభరణాలను శ్రీకాకుళం రూరల్ పోలీసులు రికవరీ చేశారు. అం తర్ జిల్లాకు చెందిన ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ మేరకు ఏఎస్పీ(క్రైం) పి.శ్రీనివాసరావు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో నిందితులను ప్రవే శపెట్టి వివరాలను వెల్లడించారు. ‘శ్రీకాకుళం మండలం నందగిరిపేటలో రెండు, రాగోలు లో ఒకటి, గార మండలం కె.మత్స్యలేశంలోని మూడు దొంగతనాల కేసులు ఇటీవల నమో దయ్యాయి. కాకినాడకు చెందిన రేకడి వెం కటేశ్వర్లు, ధర్మాది ప్రసాద్, మాడెం మోహన్ కుమార్ ఈ చోరీలకు పాల్పడినట్టు దర్యా ప్తులో తేలింది. వారిని శ్రీకాకుళం మండలం తండ్యేంవలసలో ఆదివారం అరెస్టు చేశాం. వారి నుంచి చోరీకి గురైన 186 గ్రాముల బంగారం, 263 గ్రాముల వెండి ఆభరణా లను స్వాధీనం చేసుకున్నాం. ఆ ముగ్గురూ కాకినాడ సబ్‌జైల్లో ఉన్నప్పుడు స్నేహితు లయ్యారు. దొంగతనాలను వృత్తిగా మార్చు కున్నారు. ఇంటికి, బీరువాలకు వేసిన తాళా లు చాకచక్యంగా తీయడంలో సిద్ధహస్తులు. ఒక్కొక్కరిపై సుమారు 25 కేసులు ఉన్నాయ’ ని ఏఎస్పీ తెలిపారు. అలాగే దూసి గ్రామంలో రూ.3లక్షల నగదు, 8 తులాల బంగారం పోయిందని తప్పుడు ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తి ఇంట్లో ఎటు వంటి చోరీ జరగలేదన్నారు. తప్పుడు ఫిర్యా దు ఇచ్చిన వ్యక్తిపై కూడా కేసు నమోదు చేశామని తెలిపారు. సమావేశంలో శ్రీకాకు ళం వన్‌టౌన్ సీఐ పైడిపునాయుడు, రూర ల్ ఎస్‌ఐ రాము పాల్గొన్నారు.