Share News

ఏమైందో..

ABN , Publish Date - Sep 20 , 2025 | 11:17 PM

Lolugu KGBV students jumped in the buildings పొందూరు మండ లం లోలుగు కేజీబీవీలో ఇంటర్‌ విద్యార్థిని పాఠశాల మేడపై నుం చి దూకింది. శుక్రవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకోగా.. పాఠశాల సిబ్బంది ప్రమాదవశాత్తు జరి గిందని చెబుతున్నారు.

ఏమైందో..
చికిత్స పొందుతున్న వందన

మేడపై నుంచి దూకిన ఇంటర్‌ విద్యార్థిని

లోలుగు కేజీబీవీలో రాత్రివేళ ఘటన

ప్రమాదమంటున్న పాఠశాల సిబ్బంది

పొందూరు, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): పొందూరు మండ లం లోలుగు కేజీబీవీలో ఇంటర్‌ విద్యార్థిని పాఠశాల మేడపై నుం చి దూకింది. శుక్రవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకోగా.. పాఠశాల సిబ్బంది ప్రమాదవశాత్తు జరి గిందని చెబుతున్నారు. ప్రిన్సిపాల్‌ మందలించడంతో ఆ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందనే ఆరోపణలు వినిపిస్తున్నా యి. ఇటీవల లోలుగు కేజీబీవీలో గతంలో పనిచేసిన ప్రిన్సిపాల్‌ సౌమ్య తప్పుడు ఆరోపణలతో వివాదం జరిగిన విషయం తెలిసిం దే. తాజాగా విద్యార్థిని ఈ ఘటనకు పాల్పడడానికి కారణమేంట నేది చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. లోలుగు కాలనీకి చెందిన సీహెచ్‌ వందన పొందూరు మండలం లోలుగు కేజీబీవీ లో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. శుక్రవారం అర్ధ రాత్రి 2 గంటల సమయంలో పాఠశాల రెండో అంతస్తు మేడపై నుంచి కిందకు దూకింది. విద్యార్థినులంతా ఆ సమయంలో నిద్ర పోగా.. భారీ శబ్దం రావడంతో ఉలిక్కిపడి లేచారు. విద్యార్థినులు, పీఈటీ రూప వెళ్లి చూడగా.. వందన తీవ్ర గాయాలతో కనిపించింది. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. వారి సూచన మేరకు విద్యార్థినిని ప్రిన్సిపాల్‌ లలిత ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని రిమ్స్‌కు తరలించారు. తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇవ్వడంలో వారూ ఆస్పత్రికి చేరుకున్నారు. వందన ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కాగా.. విద్యార్థినికి కుటుంబ, వ్యక్తిగత సమస్యలు లేవని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు చెబుతున్నారు. పాఠశాల సిబ్బంది మాత్రం ప్రమాదవశాత్తూ ఈ ఘటన జరిగిందని పేర్కొంటున్నారు. అర్ధరాత్రి సమయంలో మేడమీదకు వెళ్లాల్సిన అవసరం విద్యార్థినికి లేదని, ఇది ఆత్మహత్యాయత్నమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. వ్యక్తిగత విషయాలపై ప్రిన్సిపాల్‌ సున్నితంగా మందలించారని.. అందుకే ఆత్మహత్యాయత్నం చేసుకుందని ఆరోపణలున్నాయి. దసరా సెలవుల ముందురోజు ఈ ఘటన జరగడంతో తోటి విద్యార్థినులు కన్నీటి పర్యంతమవుతున్నారు. కాగా సమాచారం తెలుసుకుని ఎంఈవో-1 వాగ్దేవి శనివారం శ్రీకాకుళంలో రిమ్స్‌కు వెళ్లి విద్యార్థిని పరామర్శించారు. ఘటనపై ఆరాతీసి పూర్తిస్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై పొందూరు ఎస్సై వి.సత్యనారాయణ దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Sep 20 , 2025 | 11:17 PM