విద్యార్థిని మృతిపై ముమ్మర దర్యాప్తు
ABN , Publish Date - Nov 01 , 2025 | 12:17 AM
పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం హడ్డుబంగి ఆశ్రమ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న మండంగి కవిత(13) ఇటీవల వైద్యం పొందుతూ విశాఖ కేజీహెచ్‌లో మృతి చెందిన విషయం తెలిసింది.
కొత్తూరు, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం హడ్డుబంగి ఆశ్రమ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న మండంగి కవిత(13) ఇటీవల వైద్యం పొందుతూ విశాఖ కేజీహెచ్‌లో మృతి చెందిన విషయం తెలిసింది. దీనిపై కొత్తూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఆ బాలిక మృతి చెందిందంటూ వచ్చిన ఆరోపణలపై సీతంపేట ఐటీడీఏ పీవో స్వప్నిల్ జగన్నాథ్ దర్యాప్తునకు ఆదేశించారు. దీంతో కురిగాం పీహెచ్‌సీ వైద్యాధికారి పెద్దిన ప్రసన్నకుమార్ దర్యాప్తు చేపట్టారు. పాఠశాలలో ఆస్వస్థతకు గురైన బాలికను ఆమె తల్లిదండ్రులు ఈనెల 18న కొత్తూరులో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్తిర వైద్యులకు చూపించారు. సరైన వైద్యం అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే బాలిక మృతి చెందిందని కేజీహెచ్ సూపరింటెండెంట్ పీవోకు నివేదిక ఇవ్వడంతో దర్యాప్తునకు ఆదేశించారు. కాగా ఈ ప్రైవేట్ వైద్యుడి నిర్లక్ష్యం వల్ల ఇటీవల ఓ వివాహిత మృతి చెందింది. దీనిపై కేసు విచారణ కొనసాగుతుంది. ఈ ఘటన మరువుక ముందే విద్యార్థిని మృతి చెందడంతో దర్యాప్తు చేయాలని ఆదేశించారు బాలిక స్వగ్రామం డొంబంగివలస, ఆశ్రమ పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులను వివరాలు అడిగి తెలుసుకొన్నారు.