కేజీబీవీలపై సోలార్ ఏర్పాటు తప్పనిసరి
ABN , Publish Date - Nov 06 , 2025 | 12:04 AM
జిల్లా లోని అన్ని కేజీబీవీ భవనాలపై సోలార్ వ్యవస్థ ఏర్పాటు తప్పనిసరని, దీనికి సంబంధించి ప్రతిపాదనలు పంపా లని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు.
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
పాత శ్రీకాకుళం, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): జిల్లా లోని అన్ని కేజీబీవీ భవనాలపై సోలార్ వ్యవస్థ ఏర్పాటు తప్పనిసరని, దీనికి సంబంధించి ప్రతిపాదనలు పంపా లని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో రెసిడెన్షియల్ పాఠ శాలలు, కేజీబీవీల మరమ్మతులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కోఆర్డినేటర్ యశోదలక్ష్మి మాట్లాడుతూ.. రూ. కోటి అంచనాలు సిద్ధం చేశామన్నారు. కోటబొమ్మాళి కేజీబీవీలో ప్రహరీ కూలి పోవడం, డ్రైనేజ్ సమస్యలపై కలెక్టర్ ఆరా తీసి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫ్లోరింగ్ సరిగా లేని చోట గ్రానైట్ వేయాలని సూచించారు. పిల్లల భద్రత కోసం అన్ని కేజీబీవీల భవనాల పైఅంతస్తులకు గేట్లు, తాళాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, డీఈవో రవిబాబు, ఎస్‌ఎస్‌ఏ ఏపీసీ శశిభూషణ్, ప్రిన్సిపాళ్లు, ఇంజనీర్లు పాల్గొన్నారు.
జల్‌జీవన్ పనులు వేగవంతం చేయాలి
జల్‌జీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర పుండ్కర్ అధికారులను ఆదేశిం చారు. కలెక్టరేట్‌లో బుధవారం ఆర్‌డబ్ల్యూఎస్ అఽధికారు లతో సమీక్ష నిర్వహించారు. టెండర్ స్థాయిలో ఉన్న వాటిని సత్వరమే పూర్తి చేయాలన్నారు. ఉద్దానం ప్రాంతానికి సంబంధించి అటవీ శాఖ వద్ద ఉన్న సమ స్యను సంబంధిత అధికారులు తెలుసుకుని పరిష్కరించా లన్నారు. ఎచ్చెర్ల మండలంలో స్థల సమస్య ఉందని ఎస్‌ఈ తక్షణమే పరిశీలించాలన్నారు. సమావేశంలో ఆర్‌డ బ్ల్యూఎస్ ఎస్‌ఈ శంకర్‌బాబు, డీఈఈలు, ఏఈలు పాల్గొన్నారు.