Share News

గ్రానైట్‌ క్వారీల తనిఖీ

ABN , Publish Date - May 19 , 2025 | 11:52 PM

మెళియాపుట్టి మండ లం దబ్బగుడ్డి పరిధిలో మౌనిష్‌రెడ్డి, కూనపురెడ్డి గ్రానై ట్‌ క్వారీలో ఈనెల 16న పేలుళ్లతో ముగ్గురు మృతి చెందిన నేపథ్యంలో రెవెన్యూ, పోలీస్‌, మైన్స్‌ శాఖల అధికారులు తనిఖీలు చేపడుతున్నారు.

గ్రానైట్‌ క్వారీల తనిఖీ
టెక్కలి ప్రాంతంలో క్వారీని పరిశీలిస్తున్న ఆర్డీవో కృష్ణమూర్తి

టెక్కలి, మే 19(ఆంధ్రజ్యోతి): మెళియాపుట్టి మండ లం దబ్బగుడ్డి పరిధిలో మౌనిష్‌రెడ్డి, కూనపురెడ్డి గ్రానై ట్‌ క్వారీలో ఈనెల 16న పేలుళ్లతో ముగ్గురు మృతి చెందిన నేపథ్యంలో రెవెన్యూ, పోలీస్‌, మైన్స్‌ శాఖల అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. ఇందులో భా గంగా సోమ వారం టెక్కలి మండలంలో ఎక్స్‌ ప్లోజి వ్స్‌ లైసెన్స్‌ కలిగి ఉన్న పలు గ్రానైట్‌ క్వారీలను ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, సీఐ ఎ.విజయ్‌కుమార్‌ తనిఖీ చేశారు. ఆయా కారీల్లో ఏ మేరకు పేలుడు పదార్థాలు కలిగివున్నారు, అన్నిరకాల అనుమతులున్నాయా తది తర వివరాలను సేకరించారు. క్వారీల్లో మైనింగ్‌ సేఫ్టీ మేనే జర్‌తో పాటు స్కిల్డ్‌ లేబర్‌ ఏ మేరకు ఉన్నారన్న వివ రాలపై ఆరాతీశారు. క్వారీలకు పర్యావరణ, రెవె న్యూ, మైన్స్‌ అనుమతులు తప్పనిసరి అని స్పష్టం చేశారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

కొత్తూరు, మే 19(ఆంధ్రజ్యోతి) స్టోన్‌ క్రషర్లలో నిబం ధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుం టామని తహసీల్దార్‌ కె.బాలకృష్ణ తెలిపారు. సోమవారం శోభ నాపురం, దిమిలి, రాయల వద్ద ఉన్న నాలుగు స్టోన్‌ క్రషర్లను ఎస్‌ఐ ఎండీ అమీర్‌ ఆలీతో కలిసి తనిఖీ చేశారు. రాయిని పేల్చేందుకు లెసెన్స్‌ ఉన్న వారితో మాత్రమే బాంబు పేలుళ్లు చేపట్టాలన్నారు. అనుమ తులు లేని వారితో పేలుళ్లు చేయిస్తే సంబంధిత యజ మానులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తా మని స్పష్టం చేశారు. వీఆర్వోలు, సర్వేయర్లు పాల్గొన్నారు.

స్టోన్‌క్రషర్‌ క్వారీల పరిశీలన

హిరమండలం, మే 19(ఆంధ్రజ్యోతి): ఇటీవల మెళి యాపుట్టి గ్రానైట్‌ క్వారీలో ముగ్గురు కార్మికులు మృతి చెందిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. తహసీల్దార్‌ హనుమంతురావు, ఎస్‌ఐ ఎండీ యాసిన్‌, ఆర్‌ఐ శంకరరావు మండలంలోని పలు స్టోన్‌క్రషర్‌ క్వారీలను సోమవారం తనిఖీ చేశారు. ప్రస్తుతం పని చేస్తున్న లోకొండ,సుభలయ క్వారీలను తనిఖీ చేసి నిబంధనలు పాటిస్తున్నారా లేదా అన్నది పరిశీలించారు.

పనులు నిలుపుదల చేయాలి

మెళియాపుట్టి, మే 19(ఆంధ్రజ్యోతి): మండలంలో గల పడ్డ రెవెన్యూ గ్రూపులో ఉన్న గ్రానైట్‌ క్వారీని సోమవారం రెవెన్యూ, మైనింగ్‌, పోలీసు అధికారులు పరిశీలించారు. ఇటీవల డబ్బగూడ గ్రానైట్‌ క్వారీలో బ్లాస్టింగ్‌ జరిగి ముగ్గురు వృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదేశాలతో అధికారులు గ్రానైట్‌ క్వారీలను తనిఖీ చేస్తున్నారు. పరిశీలన తరువాత తిరిగి అధికారుల ఆదేశాలతో క్వారీలు ప్రారంభించాలని, అప్పటి వరకు నిలుపుదల చేయాలని తహసీల్దార్‌ బి.పాపారావు తెలిపారు. ఈ తనిఖీల్లో ఎస్‌ఐ రమేష్‌బాబు, మైనింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 19 , 2025 | 11:52 PM