Share News

క్షేత్ర స్థాయిలో పరిశీలించి.. కూలీలతో ముచ్చటించి

ABN , Publish Date - Jul 22 , 2025 | 11:31 PM

మండలంలోని బోరుభద్ర, ఉమిలాడ పంచాయతీల్లో రాజస్థాన్‌కు చెందిన నేషనల్‌ లెవల్‌ మోనటింగ్‌ టీం, హెచ్‌ఆర్‌ఎం బృందం సభ్యులు సునీల్‌ బంఠా, నామాసింగ్‌ మంగళవారం పర్యటించారు.

క్షేత్ర స్థాయిలో పరిశీలించి.. కూలీలతో ముచ్చటించి
ఉపాధి కూలీలతో మాట్లాడుతున్న కేంద్ర బృందం సభ్యులు:

సంతబొమ్మాళి, జూలై22(ఆంధ్రజ్యోతి): మండలంలోని బోరుభద్ర, ఉమిలాడ పంచాయతీల్లో రాజస్థాన్‌కు చెందిన నేషనల్‌ లెవల్‌ మోనటింగ్‌ టీం, హెచ్‌ఆర్‌ఎం బృందం సభ్యులు సునీల్‌ బంఠా, నామాసింగ్‌ మంగళవారం పర్యటించారు. క్షేత్రస్థాయిలో ఉపాధి పనులను పరిశీలించా రు. ఆయా పంచాయతీల్లో ఉపాధిహామీ కూలీలు, ఎస్‌హెచ్‌జీ సభ్యులు, గృహనిర్మాణ పనులపై లబ్ధిదారులతో ముచ్చటించారు. ఉపాధిపనులు గ్రామానికి ఎంతదూరంలో చేస్తున్నారు, సకాలంలో బిల్లు అందుతుండడంపై లబ్ధిదారులను అడిగితెలుసుకున్నారు.స్వయంశక్తి సంఘాలు పనితీరు, రుణాలు సకాలంలో అందడం, రుణాలతో నిర్వహించే స్వయంఉపాధి కార్యక్రమాలపై ఆరాతీశా రు. కార్యక్రమంలో డ్వామా పీడీ సుధాకర్‌, ఎంపీడీవో జయంత్‌ప్రసాద్‌, ఇన్‌చార్జి డిప్యూటీ ఎంపీ డీవో సిద్దార్ద, ఏపీవో నర్సింహమూర్తి, హరిప్రసాద్‌, పంచాయతీ కార్యదర్శి రమేష్‌ ఏపీఎంలు శ్రీని వాసరావు,సూర్యనారాయణ, అంజిత్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 22 , 2025 | 11:31 PM