విద్యార్థుల అమానుషం
ABN , Publish Date - Nov 12 , 2025 | 11:58 PM
ప్రభుత్వ వసతి గృహంలో ఉంటూ ఏడో తరతి విద్యార్థిపై లైంగిక వేధింపులకు పాల్పడిన విద్యార్థుల ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
రణస్థలం, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ వసతి గృహంలో ఉంటూ ఏడో తరతి విద్యార్థిపై లైంగిక వేధింపులకు పాల్పడిన విద్యార్థుల ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రణస్థలం మండల కేంద్రంలోని ఒక ప్రభుత్వ హాస్టల్‌లో ఈ ఘోరం జరిగింది. హాస్టల్లో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు వసతి పొందుతున్నారు. ఏడో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి నీరసంగా కనిపించాడు. అక్కడ వంట మనిషిగా పనిచేస్తున్న ఒక వ్యక్తి దీనిని గమనించి ఆరా తీశాడు. తనకు ఎదురైన పరాభవాన్ని ఆ విద్యార్థి వివరించాడు. హాస్టల్‌లో ఉంటూ తొమ్మిదో తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థులతో పాటు మరో పదో తరగతి విద్యార్థి గత కొద్ది రోజులుగా ఏడో తరగతి విద్యార్థిపై లైంగిక వేధింపులకు పాల్పడి వీడియోలు తీస్తున్నారు. వాటిని పట్టుకుని బ్లాక్ మెయిల్‌కు పాల్పడ్డారు. అయితే ఆ విద్యార్థిలో వస్తున్న మార్పును గమనించిన వంట మనిషి ఈ విషయాన్ని విద్యార్థులు చదువుతున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారికి టీసీలిచ్చి హెచ్‌ఎం పంపించినట్లు తెలిసింది. అయితే వేధింపులకు గురైన విద్యార్థిని చికిత్స నిమిత్తం వంట మనిషి కొండ ములగాం ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కి తర లించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జేఆర్‌పురం ఎస్‌ఐ ఎస్.చిరంజీవి తెలిపారు.