అధ్వానంగా పారిశ్రామికవాడ
ABN , Publish Date - Sep 28 , 2025 | 11:51 PM
ఇంగిలిగాం పారిశ్రామికవాడలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో వ్యాపారులు ఇబ్బందిపడుతున్నా రు.
రహదారులు ధ్వంసం.. పూడుకుపోయిన కాలువలు
కానరాని కనీస వసతులు
పలాస, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): ఇంగిలిగాం పారిశ్రామికవాడలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో వ్యాపారులు ఇబ్బందిపడుతున్నా రు. అభివృద్ధి పనుల కోసం ఏటా వ్యాపారుల నుంచి పన్నుల రూపంలో నిధులు వసూళ్లు చే స్తున్నా అందులో ఒక్క పైసా కూడా ఖర్చు చే యకపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవు తోంది. కనీసం తమ నుంచి వసూళ్లు చేస్తున్న నిధులతోనైనా అభివృద్ధి చేయండని డిమాండ్ చేస్తున్నా ఏపీఐఐసీ అధికారులు మాత్రం చూసీచూడనట్టు వ్యవహరిస్తుండడం విశేషం.
పలాసకు రెండు కిలోమీటర్ల దూరంలో ఇంగిలిగాం పారిశ్రామికవాడ 25 ఏళ్ల క్రితం ఏర్పాటు చేశారు. 30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పారిశ్రామికవాడలో జీడి పరిశ్రమలు, జీడి ఆయల్ పరిశ్రమలు, కర్రల మిల్లులు ఉన్నాయి. నిత్యం వేలాదిమంది కార్మికులు, వందలాది వ్యాపారులకు ఉపాధి కేం ద్రంగా ఉన్నాయి. పారిశ్రామి కవాడను ఏపీఐఐసీ ఆధీ నంలో నిర్వహిస్తున్నారు. వా రి ఆధ్వర్యంలోనే రహదారు లు, కాలువలు, తాగునీరు, వి ద్యుత్ వంటి మౌలిక సదు పాయాలు కల్పించి వ్యాపారు లకు అన్నివిధాలా సహాయ కారిగా ఉండాలి. కానీ అధి కారులు మాత్రం తూతూ మంత్రంగా అభివృద్ధి చేస్తూ చేతులు దు లుపుకుంటున్నారు. ప్రసుత్తం పారిశ్రామి కవాడలో ఏ ప్రాం తంలో కూడా ర హదారులు బాగోలే వు. ప్రారంభంలోనే రోడ్డు పూర్తిగా పాడవగా, వెనుకభాగంలో రం ధ్రాలు ఏర్పడి వర్షం పడితే ఏది రోడ్డో, ఏది కా లువ అనేది తెలియక వ్యాపారులు తీవ్ర ఇ బ్బందులు పడుతున్నారు. ఇటీవల ఓ వ్యాపా రికి చెందిన వ్యాను రంధ్రాల్లో కూరుకుపోయి భారీగా నష్టం ఏర్పడింది. దీంతో పాటుగా పక్కా మురుగు కాలువలు ఏర్పాటు చేయాల్సి ఉంది. దీనికి నిర్వహణ లేకపోవడంతో కాలువ లన్నీ పూడుకుపోయాయి. తాగునీరు వసతి పూర్తిగా లేకపోవడంతో వ్యాపారులే తమ పరి శ్రమల్లో బోర్లు వేసుకొని కార్మికులకు తాగునీరు అందిస్తున్నారు. ఈ ప్రాంతంలో విద్యుత్ కొరత కూడా తీవ్రంగా ఉంది. నిత్యమూ మరమ్మతు లకు గురై ట్రాన్స్‌ఫార్మర్ల నిర్వహణ అస్తవ్యస్తం గా ఉంది. తమకు సరైన వసతులు లేవని వ్యా పారులు కోరుతున్నా అధికారులు మాత్రం ప ట్టించుకోవడం లేదు. కొత్తగా పారిశ్రామికవాడ ఏర్పాటు చేసి వ్యాపారులకు అందిస్తామని అ ధికారులు చెబుతుండడంపై సర్వత్రా విమర్శ లు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.