సేంద్రియ ఎరువులతోనే భూసారం పెంపు
ABN , Publish Date - Aug 16 , 2025 | 11:38 PM
సేంద్రియ ఎరువులు వాడకం వల్ల భూసారం పెంచడంతో పాటు అధిక దిగుబడులు సాధించవచ్చని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు.
జలుమూరు, (సారవకోట), ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): సేంద్రియ ఎరువులు వాడకం వల్ల భూసారం పెంచడంతో పాటు అధిక దిగుబడులు సాధించవచ్చని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. స్థానిక మండల పరిషత్ సమావేశ భవనంలో శనివారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రసాయనిక ఎరువులు విరివిగా వాడడం వలన భూసారం తగ్గి దిగుబడులు తగ్గుతున్నాయన్నారు. ముందుగా సర్దార్ గౌతు లచ్చన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే నివాళులర్పించారు. ఎంపీపీ చిన్నాల కూర్మినాయుడు, మండల ప్రత్యేకాధికారి మంద లోకనాథం, ఎంపీడీవో మోహనకుమార్, పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, అధికారులు పాల్గొన్నారు.