పెంచిన విద్యుత్ సర్దుబాటు చార్జీలు తగ్గించాలి
ABN , Publish Date - Jul 05 , 2025 | 11:55 PM
పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు యుగం ధర్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎల్.వెంకట్రావు డిమాండ్ చేశారు.

కాశీబుగ్గ, జూలై 5 (ఆంధ్రజ్యోతి): పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు యుగం ధర్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎల్.వెంకట్రావు డిమాండ్ చేశారు. శనివారం కాశీబుగ్గ గాంధీ విగ్రహం వద్ద రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నిరసన తెలిపారు. స్మార్ట్ మీటర్లు ఉపసహరించు కోవాలని, అదానితో చేసుకున్న ఒప్పందాన్ని రద్దుచేయా లన్నారు. కార్యక్ర మంలో పలువురు కార్యకర్తలు పాల్గొ న్నారు.
ఉపసంహరించుకోవాలి
నరసన్నపేట, జూలై 5(ఆంధ్రజ్యోతి): విద్యుత్ బిల్లులపై ట్రూఅప్ చార్జీల పేరుతో మోపిన భారాన్ని ఉప సంహరించుకోవాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.శ్రీనివాసరావు అన్నారు. పట్టణంలో శనివారం నిరసన చేపట్టారు. పేదలపై విద్యుత్ భారాలను మోపడం తగదన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు ఎన్.మధుసూదనరావు, భాస్కరరావు, వెంకటరమణ పాల్గొన్నారు.