తీర గ్రామాల్లో ఇన్‌చార్జి కలెక్టర్, ఎమ్మెల్యే పర్యటన
ABN , Publish Date - Oct 28 , 2025 | 11:53 PM
తుఫాన్ ప్రభావం ఉన్న తీరప్రాంత గ్రామాల్లో మంగళవారం ఇన్‌చార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, ఎమ్మెల్యే గొండు శంకర్ పర్యటించారు.
గార, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): తుఫాన్ ప్రభావం ఉన్న తీరప్రాంత గ్రామాల్లో మంగళవారం ఇన్‌చార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, ఎమ్మెల్యే గొండు శంకర్ పర్యటించారు. బందరు వానిపేట, మొగదాలపాడు తదితర మత్స్యకార గ్రామాల్లో పర్యటించి స్థానిక మత్స్యకారులతో మాట్లాడారు. అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో పునరావాస కేంద్రా లకు తప్పనిసరిగా వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. అత్యవసర మైతే తప్ప ప్రజలకు ఇంటి నుంచి బయటకు రావద్దన్నారు. తుఫాన్ హెచ్చ రికల నేపథ్యంలో మంగళవారం రాత్రి గారలో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం పర్య టించి స్థానికులకు అవగాహన కల్పించారు. ఎస్‌ఐ సీహెచ్.గంగరాజు ఆధ్వ ర్యంలో ఈ టీం సభ్యులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
లోతట్టు ప్రాంతాల పరిశీలన
అరసవల్లి, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు నగరంలోని శివారు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ఆయా ప్రాంతాలను ఎమ్మెల్యే గొండు శంకర్.. నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసాదరావుతో కలిసి మంగళవారం సందర్శించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అలాగే తుఫాన్ ప్రభా వంతో కోతకు గురైన శ్రీకాకుళం రూరల్ మండలం పెద్ద గనగళ్లపేట సముద్ర తీరాన్ని మంగళవారం ఎమ్మెల్యే గొండు శంకర్ పరిశీలించారు. అలల తాకిడి పెరగడంతో తీరప్రాంత ప్రజలు అప్రమ త్తంగా ఉండాలని ఆయన సూచించారు.
తీరప్రాంత గ్రామాల్లో ఎంపీ, ఎమ్మెల్యే..
ఎచ్చెర్ల, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): ముంథా తుఫాన్ దృష్ట్యా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు మంగళవారం డి.మత్స్యలేశం, కొత్త మత్స్యలేశం, కొత్త దిబ్బల పాలెం, భగీరథపురం, బడి వానిపేట, బుడగట్లపాలెం గ్రామాల్లో పర్యటించి స్థానికులను అప్రమత్తం చేశారు. స్థానిక మత్స్యకారులతో మాట్లాడి అప్రమత్తంగా ఉండాలని సూ చించారు. ఎలాంటి నష్టం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికా రులకు సూచనలిచ్చారు. తహసీల్దార్ బి.గోపాల్ మాట్లాడుతూ మండలం లో 11 పునరావాస కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. కార్యక్రమంలో డీసీ ఎంఎస్ ఛైర్మన్ చౌదరి అవినాష్, టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి, ఎంపీడీవో ఎస్.హరిహరరావు, బుడగట్లపాలెం సర్పంచ్ అల్లుపల్లి రాంబాబు, ఎఫ్‌డీవో రవి తదితరులు పాల్గొన్నారు. భగీరథ పురంలో తుఫాన్ కారణంగా తంగి జయమ్మకు చెందిన ఆవుపై చెట్టు పడడంతో చనిపోయింది. వీరాయవలసకు చెందిన కరణం అచ్చప్పకు చెందిన పూరిల్లు నేల కూలింది.
కొవ్వాడ, అల్లివలసల్లో..
రణస్థలం, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్ ప్రభావ తీరాలైన కొవ్వాడ, అల్లివలస, జీరుపాలేం, కొల్లిభీమవరం, ఎన్‌జీఆర్ పురం తదితర ప్రాంతాలను మంగళవారం ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు సందర్శించారు. స్థానిక మత్స్యకారులతో మాట్లాడుతూ.. చేపల వేటకు వెళ్ల వద్దని, తుఫాన్ తీవ్రత వల్ల అప్రమత్తంగా ఉండాలని, వలలు, పడవ లను ఎత్తైన ప్రదేశాలకు తరలించాలని సూచించారు. కార్యక్రమంలో తహ సీల్దార్ కిరణ్‌కుమార్, జేఆర్‌పురం సీఐ ఎం.అవతారం పాల్గొన్నారు.