Share News

సమష్టి కృషితో పారిశుధ్యం మెరుగు

ABN , Publish Date - May 18 , 2025 | 12:10 AM

సమష్టి కృషితో పారిశుధ్యం మెరుగుపర్చుకోవచ్చని కలెక్టర్‌ స్వప్ని ల్‌ దినకర్‌ పుండ్కర్‌ అన్నారు.

సమష్టి కృషితో పారిశుధ్యం మెరుగు
స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్‌ స్వప్నల్‌ దినకర్‌ పుండ్కర్‌

  • కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

  • శ్రీకూర్మంలో స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర

గార, మే 17(ఆంధ్రజ్యోతి): సమష్టి కృషితో పారిశుధ్యం మెరుగుపర్చుకోవచ్చని కలెక్టర్‌ స్వప్ని ల్‌ దినకర్‌ పుండ్కర్‌ అన్నారు. శనివారం శ్రీకూ ర్మంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కా ర్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ము ఖ్యంగా గ్రామాల్లో ప్రతి ఒక్కరూ తమ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలన్నారు. ఇందుకు అధికారులు కూడా సహకరించాలన్నారు. గ్రామంలో పలు వురు ఇళ్లకు వెళ్లి పారిశుధ్యం గురించి అడిగి తెలుసుకున్నా రు. అనంతరం ఉపాధి పథకం కింద పనులు చేస్తున్న వేతనదారులతో మాట్లాడి వారికి అందిస్తున్న సౌకర్యాలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఉపాధి పనులు వద్ద తా గునీరు, నీడ కోసం టెంట్లు, మందుల కిట్లు అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార ్యక్రమంలో ఎంపీడీవో ఎస్‌.రామ్మోహన్‌రావు, తహసీల్దార్‌. ఎం.చక్రవర్తి, సర్పంచ్‌ గోరు అనిత, ఏపీవో సంధ్యారాణి, వివిధ శాఖల అధికారులు స్థానిక పెద్దలు పాల్గొన్నారు.

ఆదిత్యాలయ పరిసరాల్లో..

అరసవల్లి, మే 17(ఆంధ్రజ్యోతి): ఆరోగ్యప్రదాత అరసవ ల్లి సూర్యనారాయణ స్వామివారి ఆలయ పరిసరాల్లో శనివారం ఆలయ సూపరింటెండెంట్‌ ఎస్‌.కనకరాజు, జిల్లా పర్యాటకా ధికారి ఎన్‌.నారాయణరావు ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది, తదితరులు ఆలయ పరిసరాలను పరిశుభ్రం చేసి, చెత్తను తొలగించారు. పరిసరాల పరిశుభ్రతకు కట్టు బడి ఉంటామని, స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్ర మంలో నీలయ్య, గన్నెమ్మ తదితరులు పాల్గొన్నారు.

పరిశుభ్రత అందరి బాధ్యత

అరసవల్లి, మే 17(ఆంధ్రజ్యోతి): పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పీఎంజే బాబు అన్నారు. స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భా గంగా స్థానిక 2వ డివిజన్‌ బుచ్చిపేట వద్ద డివిజన్‌ ఇన్‌ చార్జి అక్కేన రాజారావు ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛత కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్యక్రమం లో రెడ్డి శివ, మజ్జి జగన్‌, తారక్‌, రమణ, యశోద, ధర్మా రావు, సచివాలయ సిబ్బంది, పద్మ, సంతోషి పాల్గొన్నారు.

శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో..

అరసవల్లి, మే 17(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం ఆర్టీసీ కాం ప్లెక్స్‌ ఆవరణలో శనివారం స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్ర మం జరిగింది. బస్‌స్టేషన్‌ పరిసరాలు, కాలువలను శుభ్రం చేసి, చెత్తను తొలగించి, ప్రయాణికులకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. సుమారు 40 మది సిబ్బంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో వారితో స్వచ్ఛతా ప్ర తిజ్ఞ చేయించారు. ‘‘బీట్‌ ది హీట్‌’’లో భాగంగా ప్రయాణికు ల కోసం రెండు కూలర్‌ ఫ్యాన్లు, నాన్‌స్టాప్‌ ప్లాట్‌ ఫారాల వద్ద 20 కొత్త ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో 2డిపో మేనేజర్‌ రవిశంకర్‌ శర్మ, అసిస్టెంట్‌ మేనేజర్లు, ట్రాఫిక్‌ సూపర్‌వైజర్లు, సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 18 , 2025 | 12:10 AM