Share News

ఆకట్టుకున్న వైజ్ఞానిక ప్రదర్శన

ABN , Publish Date - Dec 19 , 2025 | 11:41 PM

జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిం చిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన శుక్రవారంతో ముగిసింది.

ఆకట్టుకున్న వైజ్ఞానిక ప్రదర్శన
సోంపేట రూరల్‌: విద్యార్థినులను అభినందిస్తున్న డీఈవో, ఉపాధ్యాయులు

శ్రీకాకుళం రూరల్‌, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిం చిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన శుక్రవారంతో ముగిసింది. ఈ ప్రదర్శనలో చిన్నారుల ఆవిష్కరణలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. జిల్లా నలుమూలల నుంచి వివిధ పాఠశాల లకు చెందిన విద్యార్థులు, ఉపాఽధ్యాయులు మొత్తం 310 సైన్స్‌ నమూనాలను ప్రదర్శించారు. వ్యవసాయం, పర్యావరణం, ఆరోగ్యం, గణిత నమూనాలు వంటి విభిన్న విభాగాల్లో రూపొం దించిన ప్రాజెక్టులు అందరినీ ఆలోచింపజేశాయి. ఇందులో అత్యుత్తమంగా ఉన్న 11 ప్రాజెక్టు లు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికచేశారు. వీటిలో 7 గ్రూపు, 2 వ్యక్తిగత, 2 ఉపాఽధ్యాయుల ప్రాజెక్టులున్నాయి. రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులను, మార్గదర్శక ఉపాధ్యా యులను డీఈవో రవిబాబు అభినందించారు. కార్యక్రమంలో ఉప విద్యాశాఖాఽఽధికారులు, ఆర్‌.విజయకుమారి, పి.విలియమ్స్‌, జిల్లా సైన్స్‌ అఽధికారి ఎన్‌.కుమార స్వామి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి సైన్స్‌ ఎగ్జిబిషన్‌కు ఎంపిక

సోంపేట రూరల్‌, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): జిల్లా స్థాయి సైన్స్‌ ఎగ్జిబిషన్‌లో ఇసుక పాలెం హైస్కూల్‌ విద్యార్థినులు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని హెచ్‌ ఎం అనిల్‌కుమార్‌ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం శ్రీకాకుళంలో జరిగిన సైన్స్‌ఫెయిర్‌లో డీఈవో రవిబాబు బహుమతి అందించి అభినందించారన్నారు. న్యూక్లియర్‌ ఎనర్జీ, గ్రీన్‌ ఎనర్జీ అంశంపై విద్యార్థులు ప్రాజెక్టును ప్రదర్శించారన్నారు. ఈ సందర్భంగా వారిని హెచ్‌ఎంతో పాటు ఉపాధ్యాయులు ప్రసాదరావు, విజయలక్ష్మి, గ్రామస్థులు అభినందించారు.

Updated Date - Dec 19 , 2025 | 11:41 PM