Jee: జేఈఈ మెయిన్స్‌లో సత్తా
ABN , Publish Date - Apr 20 , 2025 | 12:43 AM
JEE Mains Top scorers జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ చదివేందుకు ఎన్‌ఐటీలో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్షలో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఉత్తమ ర్యాంకులతో ప్రతిభ చూపారు.
జిల్లా విద్యార్థులకు ఉత్తమ ర్యాంకులు
ఎచ్చెర్ల, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ చదివేందుకు ఎన్‌ఐటీలో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్షలో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఉత్తమ ర్యాంకులతో ప్రతిభ చూపారు. ఎచ్చెర్ల మండలం అల్లినగరం గ్రామానికి చెందిన బుడుమూరు విక్రమరాజా 100కు 99.9976 మార్కులతో ఓపెన్‌లో 64, ఓబీసీ కేటగిరీలో ఆరో ర్యాంకు సాధించాడు. ఈ విద్యార్థి విశాఖపట్నంలో ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ సీబీఎస్ సిలబస్‌లో చదవగా, ఇంకా ఫలితాలు రావల్సి ఉంది. ముంబై ఐఐటీలో సీఎస్‌ఈ బ్రాంచ్‌లో ఇంజనీరింగ్ పూర్తిచేయాలన్నదే తన లక్ష్యమని విక్రమరాజా తెలిపాడు. ఈయన తండ్రి సోమరాజు ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాగా, తల్లి కళ్యాణి స్థానికంగా ఓ ప్రైవేటు స్కూల్‌ను నిర్వహిస్తున్నారు.
నరసన్నపేట మండలం దేవాది గ్రామానికి చెందిన ధర్మాన జ్ఞాన రుత్విక్‌సాయి ఆలిండియా స్థాయిలో ఓపెన్ కేటగిరీలో 294వ ర్యాంకు, ఓబీసీ విభాగంలో 38వ ర్యాంకు సాఽధించాడు. 99.98 పర్సంటైల్ స్కోరు చేశాడు. రుత్విక్ విజయవాడలోని ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదవగా.. 987 మార్కులతో ఉత్తీర్ణత పొందాడు. ముంబై ఐఐటీలో కంప్యూటర్ ఇంజనీరింగ్ చేయడమే తన లక్ష్యమని రుత్విక్ తెలిపాడు. రుత్విక్ తండ్రి ధర్మాన శంకరనారాయణ, తల్లి లత ఉపాధ్యాయులు.