Share News

పారదర్శకంగా పథకాల అమలు

ABN , Publish Date - Jun 18 , 2025 | 11:43 PM

పారద ర్శకంగా పథకాలను అమలుచేస్తున్నామ ని, లేనిపోని ఆరోపణలు చేయడం వైసీపీ నేతలకు తగదని ప్రభుత్వ విప్‌, ఇచ్ఛా ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ హితవుపలికా రు.

  పారదర్శకంగా పథకాల అమలు
మాట్లాడుతున్న అశోక్‌:

కవిటి, జూన్‌18(ఆంధ్రజ్యోతి): పారద ర్శకంగా పథకాలను అమలుచేస్తున్నామ ని, లేనిపోని ఆరోపణలు చేయడం వైసీపీ నేతలకు తగదని ప్రభుత్వ విప్‌, ఇచ్ఛా ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ హితవుపలికా రు.పాఠశాలలు తెరచినరోజునే తల్లికి వం దనం హామీని రాష్ట్రప్రభుత్వం అమలు చేసిందని తెలిపారు.బుధవారం రామ య్యపుట్టుగలో ఆయన విలేకరులతో మా ట్లాడుతూపాఠశాలల ఫీజుల కోసం అప్పు చేయాల్సిన అవసరం లేకుండా తల్లులకు అందించిన సొమ్ముతో కుటుంబసభ్యులం తా ఆనందంగా ఉన్నారన్నారు. ఖాతాలో రూ13వేలు జమచేసి పాఠశాలల అభివృద్ధికి రూ.రెండు వేలు కేటాయిస్తుంటే వైసీపీ నేతలు మాత్రం మంత్రి నారా లోకేష్‌పై దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారని, ఆరోపణలు చేసిన వారు వాటిని నిరూపించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. సమావేశంలో కవిటి మండల టీడీపీ అధ్యక్షుడు పి.కృష్ణారావు, కాళింగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ బి.చిన్నబాబు పాల్గొన్నారు. కాగారామయ్యపుట్టుగలో రైతులకు విత్తనాల మినీకిట్లు ఎమ్మెల్యే అశోక్‌ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏడీఏ జగన్మోహనరావు, కవిటి, కంచిలి, ఇచ్ఛాపురం, సోంపేట మండలాల వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.

రోడ్లు నిర్మాణంతో పల్లెప్రగతి

గ్రామాల్లో రోడ్లు నిర్మాణంతోనే ప్రగతి సాధ్యమని ఎమ్మెల్యే బి.అశోక్‌ తెలిపారు. బుధవారం జగతిలో జగతి నుంచి బట్టివానిపాలెం వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు పనుుకు శంకుస్థాపనచేశారు. సీసీరోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హులైన ప్రతిఒక్కరికీ పథకాలు అందించడమే కాకుండా రాష్ట్రాన్ని ముందుకుతీసుకువెళ్లేందుకు సీఎంచంద్రబాబుప్రయత్నిస్తున్నారన్నారు. కార్యక్రమం లో జనసేన నాయకుడు దాసరి రాజు, ఏఎంసీ చైర్మన్‌ మణిచంద్రప్రకాష్‌, పి.కృ ష్ణారావు, రమణ, బి.రమేష్‌, బి.చిన్నబాబు, పి.ప్రవీణ్‌, పి.జోగారావు పాల్గొన్నారు.

Updated Date - Jun 18 , 2025 | 11:43 PM