Share News

సమస్యల తక్షణ పరిష్కారానికి చర్యలు

ABN , Publish Date - Aug 29 , 2025 | 11:32 PM

నియోజకవర్గంలో ప్రజలు ఎదు ర్కొంటున్న సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు.

సమస్యల తక్షణ పరిష్కారానికి చర్యలు
ప్రజాదర్బార్‌లో వినతులను స్వీకరిస్తున్న ఎమ్మెల్యే గొండు శంకర్‌

అరసవల్లి, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో ప్రజలు ఎదు ర్కొంటున్న సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. ఈ మేరకు విశాఖ-ఎ కాలనీలోని తన కార్యాల యంలో శుక్రవారం ప్రజాదర్బార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన దృష్టికి వచ్చిన సమస్యలపై అధికారులతో తక్షణమే మాట్లాడి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. సూపర్‌ సిక్స్‌ హామీ లను అమలు చేసి సుపరిపాలన అందిస్తోందన్నారు.

Updated Date - Aug 29 , 2025 | 11:32 PM