అర్జీల పరిష్కారానికి తక్షణ చర్యలు
ABN , Publish Date - Sep 08 , 2025 | 11:57 PM
: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు వచ్చే అర్జీల పరిష్కారానికి అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆదేశించారు.
- జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్
- పీజీఆర్‌ఎస్‌కు 75 వినతులు
శ్రీకాకుళం కలెక్టరేట్, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు వచ్చే అర్జీల పరిష్కారానికి అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆదేశించారు. సోమవారం జడ్పీ సమావేశ మందిరంలో పీజీఆర్‌ఎస్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలు మూలల నుంచి ప్రజలు వచ్చి తమ సమస్యలుపై అర్జీ లు అందజేశారు. వివిధ సమస్యలపై 75 వినతులను జేసీ స్వీకరించారు.
- తమ గ్రామానికి రోడ్డు వేయాల ని సారవకోట మండలం చిన్న కిట్టాలపాడు పంచా యతీ, బొంతుగూడ గ్రామానికి చెందిన గిరిజను లు కోరారు. గత 25 ఏళ్లుగా తమ గ్రామంలో రోడ్లు, కాలు వలు లేవన్నారు. తాగునీటికి కూడా ఇబ్బందులు పడు తున్నామన్నారు. సమస్యలు పరిష్కరించాలని జేసీకి వినతిపత్రం అందజేశారు.
- తన తల్లి పేరిట ఉన్న 5.30 ఎకరాల భూమిని స్థానిక గ్రామాధికారులతో కలిసి ఆక్రమించేందుకు స్థానిక రాజకీయ నాయకుడు ప్రయ త్నిస్తున్నారని, దీనిపై విచారణ చేసి, తనకు న్యాయం చేయాలని శ్రీకాకుళం రూరల్ మండలం కణుగులవా నిపేటకు చెందిన ఇప్పిలి వెంకట శివలక్ష్మీప్రసాద్ గ్రీవెన్స్‌లో విన్నవించాడు.
- గత 11 నెలలుగా ఇమా మ్‌లు, మౌజన్‌లకు ప్రభుత్వం గౌరవ వేతనాలు చెల్లిం చడం లేదని, తక్షణమే పెండింగ్ వేతనాలు విడుదల చేసి ఆదుకోవాలని నగరానికి చెందిన పలువురు ము స్లిం నేతలు జేసీని కోరారు. పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో ఉప కలెక్టర్ బి.పద్మావతి, డిప్యూటీ కలెక్టర్(డీఎంపీసీ) టి.వేణుగోపాలరావు, అధికారులు పాల్గొన్నారు.
ఎస్పీ పీజీఆర్‌ఎస్‌కు 52 ఫిర్యాదులు..
శ్రీకాకుళం క్రైం, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కేవీ మహేశ్వ రరెడ్డి నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి భూ వివాదాలు, కుటుంబ సమస్యలు, ఆస్తి తగాదాలు, కొట్లాట తదితర సమస్యలపై 52ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదుదారులతో ఎస్పీ నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఫిర్యాదులు అన్నింటిపై చట్టం ప్రకారం విచారణ జరిపి సత్వరం పరిష్కరిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.