Revenue problems: రెవెన్యూ సమస్యలపై తక్షణమే స్పందించాలి
ABN , Publish Date - Jun 26 , 2025 | 11:57 PM
Revenue department Administrative action రెవెన్యూ సమస్యలపై సత్వరమే స్పందించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జడ్పీ సమావేశ మందిరంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలిసి గురువారం శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్‌కు సంబంధించి తహసీల్దార్లు, హెచ్‌డీటీలు, సర్వేయర్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, వీఆర్‌ఓలతో సమావేశం నిర్వహించారు.
పీజీఆర్‌ఎస్ అర్జీలు పెండింగులో ఉండరాదు
22ఏ భూములను తక్షణమే పరిశీలించాలి
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం కలెక్టరేట్, జూన్ 26(ఆంధ్రజ్యోతి): రెవెన్యూ సమస్యలపై సత్వరమే స్పందించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జడ్పీ సమావేశ మందిరంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలిసి గురువారం శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్‌కు సంబంధించి తహసీల్దార్లు, హెచ్‌డీటీలు, సర్వేయర్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, వీఆర్‌ఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తహసీల్దార్లు, వీఆర్‌ఓలతో ప్రతివారం సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. వీఆర్వోలు రెవెన్యూ సమస్యలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. పీజీఆర్‌ఎస్‌పై అర్జీలు పెండింగులో ఉండరాదని ఆదేశించారు. ఇందుకు సంబంధించి మండలాల వారీగా తహసీల్దార్లు, వీఆర్వోలతో సమీక్షించారు. ఈ-ఆఫీసుపై తహసీల్దారులకుఅవగాహన కల్పించారు. రెవెన్యూ సమస్యలపై వీఆర్వోలకు శిక్షణ ఇస్తామన్నారు. ఈహెచ్‌ఎస్ ఆసుపత్రి నిర్మాణానికి స్థల ప్రతిపాదనలు పంపాలని సైనిక సంక్షేమాధికారిని ఆదేశించారు. గార మండలంలో డీఆర్డీఏ, ఎచ్చెర్లలో ఆర్టీఓ, సరుబుజ్జిలి, రణస్థలం మండలాల్లో అంగన్‌వాడీ కేంద్రాలు, శ్రీకాకుళంలో మార్క్‌ఫెడ్, పర్యాటక శాఖకు సంబంధించిన భూ సమస్యలపై చర్చించారు. 22-ఏలో భూ యజమానులకు ముందుగా నోటీసులు పంపి పరిశీలనకు వెళ్లాలన్నారు. ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించకపోతే అలాంటి వారి జాబితాను తయారు చేయాలని ఆదేశించారు. కర్మయోగి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని డీఆర్వో ఎం.వేంకటేశ్వరరావు తెలిపారు. ఈ సమావేశంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఆర్డీఓ కె.సాయిప్రత్యూష, డిప్యూటీ కలెక్టర్లు పద్మావతి, జయదేవి తదితరులు పాల్గొన్నారు.