Share News

అక్రమంగా డబ్బుల వసూళ్లు

ABN , Publish Date - Jul 12 , 2025 | 12:02 AM

పాలకొండ మండలం బాసురు వెంకటపతి రాజుపేట గ్రామానికి చెందిన రౌతు గోవిందరావును భయపెట్టి అక్ర మంగా డబ్బులు వసూలు చేసిన కేసులో ఓ ఇద్దరిని అరెస్టు చేసినట్టు రూరల్‌ ఎస్‌ఐ కె.రాము తెలిపారు.

అక్రమంగా డబ్బుల వసూళ్లు

  • పెద్దపాడు వద్ద ఇద్దరు అరెస్టు

శ్రీకాకుళం రూరల్‌, జూలై 11(ఆంధ్రజ్యోతి): పాలకొండ మండలం బాసురు వెంకటపతి రాజుపేట గ్రామానికి చెందిన రౌతు గోవిందరావును భయపెట్టి అక్ర మంగా డబ్బులు వసూలు చేసిన కేసులో ఓ ఇద్దరిని అరెస్టు చేసినట్టు రూరల్‌ ఎస్‌ఐ కె.రాము తెలిపారు. ఈ మేరకు ఆయన తెలిపిన వివరాల మేరకు.. శ్రీకాకుళం పీఎన్‌ కాలనీకి చెందిన పైల చంద్రశేఖర్‌, పెద్దపాడుకు చెందిన బొట్ట శంకర్‌.. ఓ వివాదంలో గోవిందరావు తన కుమారుడు ఇరుక్కున్నాడు. దీంతో ఆ వ్యక్తులిద్దరూ ఈ కేసు నుంచి తప్పించేందుకు డబ్బులివ్వాలని డిమాండ్‌ చేశారు. దీంతో గోవిందరావు చంద్రశేఖర్‌కు రూ.1.5 లక్షలు, శంకర్‌కు రూ.20వేలు ఇచ్చాడు. గోవిందరావు శ్రీకాకుళం రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వారిద్దరిని పెద్దపాడు ఫ్లై ఓవర్‌ వద్ద శుక్రవారం అరెస్టు చేశారు. వీరినుంచి రూ.40 వేలు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్టు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Jul 12 , 2025 | 12:02 AM