మొబైల్ పోతే సీఈఐఆర్ ద్వారా ఫిర్యాదు చేయాలి
ABN , Publish Date - Jun 10 , 2025 | 11:57 PM
మొబైల్ ఫోన్లు పోయిన వెంటనే సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయా లని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి సూచించారు.

ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి
505 ఫోన్లు రికవరీ.. బాధితులకు అందజేత
శ్రీకాకుళం క్రైం, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): మొబైల్ ఫోన్లు పోయిన వెంటనే సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయా లని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి సూచించారు. సుమారు రూ.80 లక్షలు విలువైన 505 మొబైల్ ఫోన్లను మంగళవారం బాధి తులకు జిల్లా పోలీసు కార్యా లయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గత నాలుగు నెల లుగా వివిధ కారణాలతో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల ను రికవరీ చేసి బాధితులకు అందజేసినట్టు తెలిపారు. మరికొంత మేరకు రికవరీ చేయాల్సి ఉందని, ఇప్పటికే తొమ్మిది విడతలుగా రికవరీ చేసినఫోన్లను బాధితులకు అందజేశామని, ఇప్పుడు పదో విడతగా 505 ఫోన్లను బాధితులకు అప్పగించామన్నారు. వీటివిలువ సుమారు రూ.80 లక్షలు ఉంటుందన్నారు. మొబైల్ ఫోన్లు వాడే ప్రతి ఒక్కరూ ఫోన్‌లో సెక్యూర్టీ లాక్ వేసుకోవాలని సూచించారు. ఏఎస్పీ కేవీ రమణ పర్యవేక్షణలో ఫోన్ల అతితక్కువ కాలంలోనే ఛేదించడంపై సైబర్, ఐటీ సెల్ సీఐ, సీసీఎస్ సీఐ, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. సమావేశంలో ఏఎస్పీ కేవీ రమణ, సీఐ ఇమ్మాన్యుయేల్ రాజు, సైబర్ సెల్ సీఐ శ్రీనివాస్, సైబర్ సెల్ ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.