Share News

చితాభస్మం కావాలా.. సంతకాలు పెట్టండి

ABN , Publish Date - May 28 , 2025 | 12:10 AM

మావోయిస్టు అగ్రనేత నంబాళ్ల కేశవ రావు అలియాస్‌ బసవరాజుకు చెందిన చితాభస్మం అయినా ఇవ్వాలని సోదరుడు రాంప్రసాద్‌ ఛత్తీస్‌గఢ్‌ పోలీసులను కోరినా నిరాకరించారని, ఎంతసేపు సంతకాలు పెట్టండి.. చూద్దాం అంటూ అక్కడి పోలీసులు ఒత్తి డి చేశారని కేశవరావు మరో సోదరుడు నంబాళ్ల ఢిల్లేశ్వరరావు తెలిపారు.

చితాభస్మం కావాలా.. సంతకాలు పెట్టండి
కేశవరావు చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న తల్లి భారతమ్మ

కేశవరావు సోదరులపై ఛత్తీస్‌గఢ్‌ పోలీసుల ఒత్తిడి

విలపిస్తున్న కేశవరావు తల్లి భారతమ్మ

టెక్కలి, మే 27(ఆంధ్రజ్యోతి): మావోయిస్టు అగ్రనేత నంబాళ్ల కేశవ రావు అలియాస్‌ బసవరాజుకు చెందిన చితాభస్మం అయినా ఇవ్వాలని సోదరుడు రాంప్రసాద్‌ ఛత్తీస్‌గఢ్‌ పోలీసులను కోరినా నిరాకరించారని, ఎంతసేపు సంతకాలు పెట్టండి.. చూద్దాం అంటూ అక్కడి పోలీసులు ఒత్తి డి చేశారని కేశవరావు మరో సోదరుడు నంబాళ్ల ఢిల్లేశ్వరరావు తెలిపారు. మృతదేహం కోసం మూడురోజులుగా ఫ్రీజర్‌ వాహనంతో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నారాయణపూర్‌ ఆసుపత్రి వద్ద పడిగాపులు కాసినా ప్రయోజనం కనిపించలేదని వాపోయారు. మృతదేహానికి దహన సంస్కారాలు సంప్ర దాయబద్ధంగా చేయలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇదిలా ఉండగా కుమారుడి మృతదేహాన్ని కడచూపునకు నోచుకోలేదని తల్లి భారతమ్మ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కేశవరావు స్వగ్రామం కోటబొమ్మాళి మండ లం జీయన్నపేటపై పోలీసులు పూర్తిస్థాయి నిఘా పెట్టారు. హైవే నుంచి జీయన్నపేటకు వెళ్లే మార్గంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. గ్రామానికి వచ్చీ పోయే వారిని ఆరా తీస్తున్నారు. కేశవరావు స్వగృహంలో ఆయన చిత్రపటం వద్ద కుటుంబ సభ్యులు, బంధువులు నివాళులర్పించారు.

Updated Date - May 28 , 2025 | 12:10 AM