బాధ్యతగా పనిచేయకుంటే సస్పెండ్ చేస్తా
ABN , Publish Date - Jul 03 , 2025 | 12:01 AM
ప్రతి రెవెన్యూ అధికారి బాధ్యతగా పని చేయాలని లేకుంటే సస్పెండ్ చేయాల్సి వస్తుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ హెచ్చరించారు.
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
హిరమండలం, జూలై 2(ఆంధ్రజ్యోతి): ప్రతి రెవెన్యూ అధికారి బాధ్యతగా పని చేయాలని లేకుంటే సస్పెండ్ చేయాల్సి వస్తుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ హెచ్చరించారు. ప్రజలకు అందించే రెవెన్యూ సేవలను చిత్తశుద్ధితో చేసి లక్ష్యాలను సాధించాలన్నారు. కల్లట గ్రామంలోని ఓ ప్రైవేటు కల్యాణ మం డపంలో టెక్కలి డివిజన్ తహసీల్దార్లు, ఉప తహశీల్దార్లు, వీఆ ర్వోలు, మండల సర్వేయర్లతో సమీక్ష సమావేశం నిర్వ హించారు. మండలాల వారీగా ప్రజా సమస్యల పరి ష్కార వినతులు, 22ఎ నిషేధ భూముల వివరాలు, ఇళ్లస్థలాల రీ వెరిఫికేషన్ తదితర అంశాలపై సమీ క్షించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులైన ప్రతీ ఒక్కరికి అందించడమే మొదటి ప్రాధాన్యంగా తీసుకో వాలన్నారు. సమస్యల పరిష్కార వేదికలో (పీజీఆర్ ఎస్) ప్రజల నుంచి వచ్చిన వినతులను క్షేత్రస్థాయిలో ఎంత వరకు పరిష్క రించిందీ ప్రతిరోజు పర్యవేక్షించాలని ఆదే శించారు. ఇళ్లస్థలాల నిమిత్తం ఎన్ని దర ఖాస్తులు పెండింగ్‌లో ఉన్నవి, అందుబాటులో ఉన్న భూమి వివరాలను సిద్ధం చేయాలని తహసీల్దార్లకు ఆదేశించారు. మీసేవ ల్లో ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను సూచించా రు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ట్రైనీ సహాయ కలెక్టర్ డి.పృఽథ్విరాజ్ కుమార్, జిల్లా భూ సర్వే, రికార్డుల నిర్వహణాధికారి కె.రమేష్, ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, కేఆర్ ఆర్‌సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, తహసీల్దార్లు, డీటీలు తదితరులు పాల్గొన్నారు.
రోగులకు అందుబాటులో ఉండాలి
జలుమూరు, (సారవకోట), జూలై 2(ఆంధ్రజ్యోతి): వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించి రోగులకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. బొంతు పీహెచ్‌సీని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్యులపై నమ్మకం కలిగేలా రోగులకు సేవలందించాలన్నారు. గర్భిణులకు మెరుగైన వైద్య సేవలందించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దారు విజయలక్ష్మి, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.