Share News

Differences in weight: తూకంలో తేడా వస్తే చర్యలు తప్పవు

ABN , Publish Date - Aug 12 , 2025 | 11:50 PM

Unannounced inspections by authorities తూకంలో తేడాలు వస్తే కఠినచర్యలు తప్పవని తూనికల కొలతలశాఖ జిల్లా అసిస్టెంట్‌ కమిషనర్‌ పి.చిన్నమ్మ హెచ్చరించారు.

Differences in weight: తూకంలో తేడా వస్తే చర్యలు తప్పవు
కిరాణాషాపులో తనిఖీ చేస్తున్న అధికారులు

  • జిల్లా అసిస్టెంట్‌ కమిషనర్‌ పి.చిన్నమ్మ

  • పలాసలో 14 కేసులు నమోదు

  • పలాస, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): తూకంలో తేడాలు వస్తే కఠినచర్యలు తప్పవని తూనికల కొలతలశాఖ జిల్లా అసిస్టెంట్‌ కమిషనర్‌ పి.చిన్నమ్మ హెచ్చరించారు. మంగళవారం పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో కిరాణా, చికెన్‌, మాంసం, చేపల షాపుల్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మొత్తం 14 కేసులు నమోదు చేశారు. అసిస్టెంట్‌ కమిషనర్‌ చిన్నమ్మ మాట్లాడుతూ ‘వినియోగదారులకు నాణ్యమైన సరకులతోపాటు తూకం సక్రమంగా ఉండాలి. జిల్లావ్యాప్తంగా నిరంతరంగా తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తాం. పలాస-కాశీబుగ్గలో ఎక్కువగా ఫిర్యాదులు అందుతున్నాయి. మూడు చేపల దుకాణాలు, ఆరు కిరాణాషాపులు, రెండు చికెన్‌ దుకాణాలు, ఒక్కో ఫ్రూట్‌షాపు, హార్డ్‌వేర్‌, ఫర్మీచర్‌ దుకాణాల్లో తనిఖీ చేశాం. తూకాల్లో తేడా రావడంతో కేసులు నమోదు చేశాం. కాటాలకు ఏటా ప్రభుత్వ ముద్రలు వేసుకోవాల’ని తెలిపారు. కాటా వర్కర్లు, సిబ్బంది కుమ్మక్కవుతున్నట్లు తమకు ఫిర్యాదులందుతున్నాయని, ఇకపై అవకతవకలకు పాల్పడితే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. దాడుల్లో శ్రీకాకుళం ఇన్‌స్పెక్టర్‌, పలాస ఇన్‌చార్జి ఎ.బలరామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Aug 12 , 2025 | 11:50 PM