Share News

సమస్యలు పరిష్కరించకుంటే పన్నులు చెల్లించం

ABN , Publish Date - Jun 13 , 2025 | 12:02 AM

మునిసిపాల్టీ పరిధి రత్తకన్న 20వ వార్డులో నెలకొన్న సమస్యలు పరిష్కరించే వరకు పన్నులు చెల్లించేది లేదని ఆ వార్డుకు చెందిన గ్రామపెద్దలు, మహిళలు కోరారు. ఈ మేరకు వారంతా మునిసిపల్‌ కమిషనర్‌ ఎన్‌.రమేష్‌ను గురువారం కలిసి వినతి పత్రం అందించారు.

సమస్యలు పరిష్కరించకుంటే పన్నులు చెల్లించం
కమిషనర్‌కు వినతి పత్రాన్ని అందజేస్తున్న మహిళలు

  • ఇచ్ఛాపురం మునిసిపాలిటీ 20వ వార్డు రత్తకన్న వాసులు

  • కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేత

ఇచ్ఛాపురం, జూన్‌ 12(ఆంధ్రజ్యోతి): మునిసిపాల్టీ పరిధి రత్తకన్న 20వ వార్డులో నెలకొన్న సమస్యలు పరిష్కరించే వరకు పన్నులు చెల్లించేది లేదని ఆ వార్డుకు చెందిన గ్రామపెద్దలు, మహిళలు కోరారు. ఈ మేరకు వారంతా మునిసిపల్‌ కమిషనర్‌ ఎన్‌.రమేష్‌ను గురువారం కలిసి వినతి పత్రం అందించారు. రత్తకన్న దేవాంగుల వీధి తూర్పువైపులో సీసీ డ్రైన్‌, రోడ్డుతోపాటు ఎలక్ట్రికల్‌ ఫోల్స్‌ లేవని, అలాగే కొళిగాం రోడ్డు వరకు పనులు చేపట్టాలని కోరారు. లేదంటే ఇంటి పన్నులు చెల్లించమని స్పష్టం చేశా రు. మునిసిపాల్టీ ఏర్పడినప్పటి నుంచి వార్డులో సమస్యలు తిష్టవేసి ఉన్నాయన్నారు. స్థలం కేటాయిస్తే వార్డు ప్రజలు సొంత డబ్బులతో వినాయ మండపాన్ని నిర్మించుకుం టాన్నారు. విద్యుత్‌ దీపాలు వెలగకపోవడంతో రాత్రిపూట బయటకు రావాలంటే భయ పడుతున్నామన్నారు. కార్యక్రమంలో గ్రామస్థులు సి.పితాంబరరెడ్డి, పి.పార్వతి, దమ యంతి, హరిప్రసాద్‌ గోపాల్‌, గీతాంజలి, లక్ష్మి, సాయమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 13 , 2025 | 12:02 AM