Share News

సమస్యలు పరిష్కరించకుంటే పోరాటం ఉధృతం

ABN , Publish Date - Dec 16 , 2025 | 11:36 PM

పీఏసీ ఎస్‌ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరిం చాలని, లేకుంటే పోరాటం ఉధృతం చేస్తామని ఏపీ పీఏసీఎస్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపా ధ్యక్షుడు రంగనాథ్‌, సీఐ టీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజే శ్వరరావు హెచ్చ రించారు.

సమస్యలు పరిష్కరించకుంటే పోరాటం ఉధృతం
ధర్నా చేస్తున్న సంఘం నేతలు, పీఏసీఎస్‌ ఉద్యోగులు

అరసవల్లి, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): పీఏసీ ఎస్‌ ఉద్యోగుల సమస్య లను వెంటనే పరిష్కరిం చాలని, లేకుంటే పోరాటం ఉధృతం చేస్తామని ఏపీ పీఏసీఎస్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపా ధ్యక్షుడు రంగనాథ్‌, సీఐ టీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజే శ్వరరావు హెచ్చ రించారు. స్థానిక జిల్లా సహకార అధికారి కార్యాలయం వద్ద ఐక్య వేదిక ఆధ్వర్యంలో మంగళ వారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 36 జీవో అమలు చేయాలని, పీఆర్సీ ఇవ్వాలని లేకుంటే 50శాతం తగ్గకుండా మధ్యంతర భృతి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గ్రాట్యుటీ చెల్లించాలని, 2019 తరువాత జాయిన్‌ అయిన ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని, పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు పెంచాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం ఈనెల 29న విజయవాడ ధర్నా చౌక్‌ వద్ద మహాధర్నా చేస్తామని, అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే నిరవధిక నిరాహార దీక్షకు కూర్చుంటామన్నారు. అనంతరం జిల్లా సహకార అధికారి బి.మురళీకృష్ణకి వినతిపత్రం అందిం చారు. కార్యక్రమంలో యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శులు లోలుగు మోహనరావు, బల్లెడ రామారావు, ప్రతినిధులు లక్ష్మీ నారాయణ, పాపినాయుడు, జగదీష్‌, మహేశ్వరి, సౌజన్య, ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 16 , 2025 | 11:36 PM