Share News

ఇచ్ఛాపురం టు తిరుపతి సైకిల్‌ యాత్ర

ABN , Publish Date - Dec 21 , 2025 | 12:21 AM

సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించి పార్టీ అధి నేత చంద్రబాబు నాయుడు సీఎం అయితే తిరుపతి వచ్చి మొక్కు చెల్లించుకుంటానని భావించిన కంచిలి మండలం బూరగాం గ్రామానికి చెందిన దివ్యాంగుడు నెయ్యిల ప్రసాద్‌ ట్రై సైకిల్‌ యాత్ర కు శ్రీకారం చుట్టాడు.

ఇచ్ఛాపురం టు తిరుపతి సైకిల్‌ యాత్ర
ట్రై సైకిల్‌ యాత్రను ప్రారంభిస్తున్న టీడీపీ నేతలు

ఇచ్ఛాపురం, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించి పార్టీ అధి నేత చంద్రబాబు నాయుడు సీఎం అయితే తిరుపతి వచ్చి మొక్కు చెల్లించుకుంటానని భావించిన కంచిలి మండలం బూరగాం గ్రామానికి చెందిన దివ్యాంగుడు నెయ్యిల ప్రసాద్‌ ట్రై సైకిల్‌ యాత్ర కు శ్రీకారం చుట్టాడు. ఈ మేరకు యాత్రకు శనివారం టీడీపీ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు పత్రి తవిటయ్య, నందిగాం కోటి పార్టీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సైకిల్‌పై తిరుపతి చేరుకుని మెట్ల మార్గంలో మోకాళ్లతో నడిచి వెళ్లి స్వామిని దర్శించుకుంటానని మొక్కు కున్నానని, తన కోరిక నెరవేరినందున యాత్ర ప్రారంభించానన్నారు. కార్యక్రమం లో రెడ్డిక కార్పొరేషన్‌ చైర్మన్‌ కొండా శంకర్‌రెడ్డి, కౌన్సిలర్లు కాళ్ల దిలీప్‌, జి.శేఖర్‌, నారాయణ బెహరా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 21 , 2025 | 12:21 AM