Share News

భార్య మందలించిందని భర్త ఆత్మహత్య

ABN , Publish Date - Dec 25 , 2025 | 12:21 AM

భార్య మందలించిందని మన స్తాపంతో జడ కృష్ణ(39) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం నగరంలో చోటు చేసుకుంది.

భార్య మందలించిందని భర్త ఆత్మహత్య

శ్రీకాకుళం క్రైం, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): భార్య మందలించిందని మన స్తాపంతో జడ కృష్ణ(39) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం నగరంలో చోటు చేసుకుంది. వన్‌టౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండలవీధికి చెందిన జడ కృష్ణ పాల వ్యాపారం చేస్తూ భార్య, ఇద్దరు పిల్లలతో కొన్నేళ్లుగా స్థానికంగా నివసిస్తున్నాడు. అయితే ఈనెల 20న జడ కృష్ణ పూటుగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. దీంతో భార్య మందలించింది. క్షణికావేశానికి గురైన కృష్ణ ఇంటి వెనుక ఉన్న పశువుల పాకలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసు కున్నాడు. కుటుంబ సభ్యులు వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ రామారావు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా మూడేళ్ల కిందట జరిగిన ప్రమాదంలో తలకు గాయమవడంతో మతిస్తిమితం కోల్పోయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

Updated Date - Dec 25 , 2025 | 12:21 AM