భార్య హత్య కేసులో భర్త అరెస్టు
ABN , Publish Date - Apr 23 , 2025 | 12:18 AM
మండలంలోని సంతవురిటి గ్రామానికి చెందిన బాలబొమ్మ వెంకట దినేష్ కృష్ణను భార్య హత్య కేసులో మంగళవారం అరెస్టు చేసినట్లు జేఆర్‌పురం సీఐ ఎం.అవ తారం తెలిపారు.
జి.సిగడాం, ఏప్రిల్ 22(ఆంధ్రజ్యోతి): మండలంలోని సంతవురిటి గ్రామానికి చెందిన బాలబొమ్మ వెంకట దినేష్ కృష్ణను భార్య హత్య కేసులో మంగళవారం అరెస్టు చేసినట్లు జేఆర్‌పురం సీఐ ఎం.అవ తారం తెలిపారు. జి.సిగడాం పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ వై.మధుసూదన రావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. పాలఖండ్యాం పంచాయతీ పరిధి జగన్నాథపురం గ్రామానికి చెందిన భవాని(21) సంతవురిటి గ్రామంలోని అత్తవారింటిలో ఈనెల 15న అనుమా నాస్పదంగా మృతి చెందినట్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సాక్షులను విచారించి సేకరించిన సాక్ష్యాధారాలు, పోస్టుమార్టం ఆధారంగా భవానితో భర్త బాలబొమ్మ వెంకట దినేష్ కృష్ణ గొడవపడి ఈనెల 15 తెల్లవారు జామున గొంతు నొక్కి చంపినట్లు నిర్థారణ కావడంతో అనుమానా స్పద కేసును హత్య కేసుగా నమోదు చేశారు. దినేష్ కృష్ణను పొం దూరు కోర్టులో ప్రవేశ పెట్టి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
అక్రమంగా తరలిస్తున్న పశువులు పట్టివేత
కొత్తూరు, ఏప్రిల్ 22(ఆంధ్ర జ్యోతి): పశువులను అక్రమంగా తర లిస్తున్న వ్యాన్‌ను సీజ్ చేసి ఒకరి పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ అమీ ర్ ఆలీ తెలిపారు. కుంచాలపేట వద్ద మంగళవారం వాహ నాలు తనిఖీ చేస్తుండగా లగేజీ వ్యాన్‌లో ఎనిమిది పశువులను తరలిస్తున్నట్లు గుర్తించి బలద గ్రామా నికి చెందిన బోరెవెల్ల షన్ముఖరావును అదుపులోకి తీసుకు న్నామన్నారు. స్వాధీనం చేసు కున్న పశువులను గోశాలకు తరలించినట్లు తెలిపారు.
రైలు కింద పడి విద్యార్థి మృతి
ఇచ్ఛాపురం, ఏప్రిల్ 22(ఆంధ్రజ్యోతి): మండ లంలోని లొద్దపుట్టి ఆర్‌హెచ్ కాలనీకి చెందిన నెయ్యిల గోపాల్ విజయనగరం రైల్వేస్టేషన్ సమీ పంలో రైలు కింద పడి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. లొద్దపుట్టికి చెందిన గోపాల్ విశాఖ జిల్లా తగరపు వలస వద్ద ఓ కళాశాలలో పాలిటెక్నిక్ డిప్లమో రెండో సంవ త్సరం చదువుతున్నాడు. సోమవారం మధ్యాహ్నం తల్లి ఢిల్లీశ్వరికి ఫోన్ చేసి ఇంటికి వస్తున్నట్లు చెప్పాడు. రాత్రి అయినా రాకపో వడంతో మంగళవారం కళాశాల ప్రిన్సిపాల్‌కు కుటుంబసభ్యులు ఫోన్‌లో సంప్రదించారు. రైలు కిందపడి గోపాల్ మృతి చెందాడని యాజమాన్య వర్గాలు తెలియజేయడంతో ఘటనా స్థలానికి కుటుంబ సభ్యులు చేరుకు న్నారు. ఇంటికి వస్తానని చెప్పిన కొడుకు ఎందుకు మృతి చెందాడో అర్థం కావడం లేదని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
రణస్థలం, ఏప్రిల్ 22(ఆంధ్రజ్యోతి): రణస్థలం జాతీయ రహదారిపై పాత పెట్రోల్ బంకు వద్ద మంగళవారం జరి గిన రోడ్డు ప్ర మాదంలో ముగ్గురు గాయపడ్డారు. పోలీ సుల కథనం మేరకు.. శ్రీకాకుళం నుంచి ద్విచక్ర వాహనం పై లావేరు మండలం పైడి వలసకు చెందిన పి.శివాజీ, ఆర్.వెంకటేష్, బి.సీతయ్య వస్తున్నారు. పాత పెట్రోల్ బంకు వద్ద యూటర్న్ తీసుకునే క్రమంలో వ్యాన్‌ను ఢీ కొనడంతో ద్విచక్ర వాహనంపై వస్తున్న ముగ్గురు గాయ పడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి 108 సిబ్బంది తరలించారు. ఈ మేరకు జేఆర్‌పురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.