Share News

భారీగా గంజాయి స్వాధీనం

ABN , Publish Date - Sep 05 , 2025 | 12:40 AM

జిల్లాలో వేర్వేరు ఘట నల్లో పోలీసులు భారీగా గంజాయి స్వాధీనం చేసు కున్నారు. ఇచ్ఛాపురం పో లీసులు 21 కిలోలు, పలా స పోలీసులు 16.5 కిలో లు, రైల్వే, ఆర్‌పీఎఫ్‌ పోలీసులు ఐదు కిలోల చొప్పున మొత్తం 42.5 కిలోల గంజాయిని పట్టుకున్నారు.

భారీగా గంజాయి స్వాధీనం
మాట్లాడుతున్న కాశీబుగ్గ సీఐ సూర్యనారాయణ

  • వేర్వేరు ఘటనల్లో 42.5 కిలోలు పట్టివేత

జిల్లాలో వేర్వేరు ఘట నల్లో పోలీసులు భారీగా గంజాయి స్వాధీనం చేసు కున్నారు. ఇచ్ఛాపురం పో లీసులు 21 కిలోలు, పలా స పోలీసులు 16.5 కిలో లు, రైల్వే, ఆర్‌పీఎఫ్‌ పోలీసులు ఐదు కిలోల చొప్పున మొత్తం 42.5 కిలోల గంజాయిని పట్టుకున్నారు.

ఒడిశా టు గుజరాత్‌

ఇచ్ఛాపురం, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): ఒడిశా రాష్ట్రం నుంచి గుజరాత్‌కు అక్రమం గా తరలిస్తున్న 21 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ మీసాల చిన్నంనాయిడు తెలిపారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లా డుతూ వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా కొడల గ్రామానికి చెందిన సాగర్‌ బెహరా, తనకు పరిచయమైన వ్యాపారి సమీర్‌ సాహు నుంచి గంజాయి కొనుగోలు చేశాడు. ఒడిశా రాష్ట్రం పీతల గ్రామానికి చెందిన రాజేష్‌తో గంజాయిని తరలిస్తుండగా కవిటి మండలం కొజ్జిరియా ఫైఓవర్‌ వద్ద కవిటి ఎస్‌ఐ రవివర్మ సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. వారి నుంచి 21కిలోల గంజాయి, రెండు సెల్‌ ఫోన్‌లు, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీరు గుజరాత్‌లోని ఒక స్పిన్నింగ్‌ మిల్‌లో పనిచేస్తున్నారన్నారు. సమావేశంలో కవిటి ఎస్‌ఐ రవివర్మ, సిబ్బంది పాల్గొన్నారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బందిని ఎస్పీ మహేశ్వరరెడ్డి అభినందించారు.

కేరళకు తరలిస్తూ..

పలాస, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): కేరళ రాష్ట్రానికి 16.5 కిలోల గంజాయి తరలిస్తూ ముగ్గు రు పోలీసులకు పట్టుబడ్డారు. గురువారం కాశీబుగ్గ సీఐ పి.సూర్యనారాయణ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఒడిశాకు చెందిన గంజా యి సాగుచేసే రైతు ఇతర ప్రాంతాలకు గంజాయి తరలిస్తే అధిక మొత్తంలో డబ్బులు ఇస్తానని అదే రాష్ట్రం గజపతి జిల్లా తబరాడ గ్రామానికి చెందిన అరబింద్‌ ఆనంద్‌కు చెప్పాడు. ఈ క్రమంలో కేరళ రాష్ట్రంలో ఓ బ్రోకరకు 16.5 కిలోల గంజాయి అం దించాలని కోరాడు. దీంతో అదే గ్రామానికి చెందిన అవినాష్‌ రైతా, కృష్ణచంద్రపూర్‌ గ్రామానికి చెందిన మటిలాల్‌ లిమా (మహిళ)తో కలిసి అరబింద్‌ ఆనంద్‌ బుధవారం సాయంత్రం ద్విచక్ర వాహనం పై గంజాయితో పలాస రైల్వేస్టేషన్‌కు వస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరిని అరెస్టు చేసి గురువా రం కోర్టులో హాజరుపరిచారు. వీరికి సహకారం అందించిన రైతు, బ్రోకర్ల కోసం వెతుకుతున్నారు. ఎస్‌ఐ నర్సింహమూర్తి, సిబ్బంది ఉన్నారు.

ఐదు కిలోలతో వ్యక్తి అరెస్టు

పలాస రైల్వే స్టేషన్‌ పరిసరాల్లో రైల్వే, ఆర్‌పీ ఎఫ్‌ పోలీసులు గురువారం సంయుక్తంగా తనిఖీ లు హించారు. ఆ సమయంలో అనుమానాస్పం దగా బెహరా కామేశ్వరరావు అనే వ్యక్తి తిరుగు తుండగా, అతడ్ని తనిఖీ చేయగా ఐదు కిలోల గంజాయి ఉన్నట్టు గుర్తించారు. మోహనరావు వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవు గ్రామ స్థుడిగా పోలీసులు తెలిపారు. ఒడిశా రాష్ట్రం మో హన ప్రాంతంలో భాను అనే వ్యక్తి వద్ద కొనుగోలు చేసి ఈ ప్రాంతంలో అమ్ముతున్నట్టు గుర్తించారు. అతడ్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - Sep 05 , 2025 | 12:40 AM