Share News

ఎన్నాళ్లీ ముంపు కష్టాలు?

ABN , Publish Date - Nov 25 , 2025 | 12:04 AM

Traffic will be blocked in case of floods వర్షం కురిస్తే చాలు.. ఆ మూడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి. నిచ్చప్పల గెడ్డ పొంగి ప్రవహించి.. బాహ్య ప్రపంచంతో గ్రామస్థులకు సంబంధాలు తెగి పోతాయి. ఎవరికి అనారోగ్యం వచ్చినా.. అత్య వసర వైద్యం అందించాల్సి ఉన్నా.. వరదనీరు తగ్గేవరకు బయటకు రాలేని పరిస్థితి. ఇదీ మెళియాపుట్టి మండలంలోని పెద్దరోకళ్లపల్లి, రామ్‌నగర్‌, సీతారామపల్లి గ్రామస్థుల దుస్థితి.

ఎన్నాళ్లీ ముంపు కష్టాలు?
ఇటీవల వంతెనపై వరదనీరు నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్న పెద్దరోకళ్లపల్లి గ్రామస్థులు

  • వరదలు వస్తే రాకపోకలు బంద్‌

  • మూడు గ్రామాల ప్రజల ఆవేదన

  • వంతెన ఎత్తు పెంచాలని వినతి

  • టెక్కలి రూరల్‌, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): వర్షం కురిస్తే చాలు.. ఆ మూడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి. నిచ్చప్పల గెడ్డ పొంగి ప్రవహించి.. బాహ్య ప్రపంచంతో గ్రామస్థులకు సంబంధాలు తెగి పోతాయి. ఎవరికి అనారోగ్యం వచ్చినా.. అత్య వసర వైద్యం అందించాల్సి ఉన్నా.. వరదనీరు తగ్గేవరకు బయటకు రాలేని పరిస్థితి. ఇదీ మెళియాపుట్టి మండలంలోని పెద్దరోకళ్లపల్లి, రామ్‌నగర్‌, సీతారామపల్లి గ్రామస్థుల దుస్థితి. ఇటీవల మొంథా తుఫాన్‌ ప్రభావంతో భారీ వర్షాలు కురవగా ఈ గ్రామాలు జలదిగ్బం ధంలో చిక్కుకున్నాయి. మూడు రోజులపాటు ఆయా గ్రామస్థులు బయటకు రాలేక ఇబ్బం దులు పడ్డారు. నిచ్చలప్ప గెడ్డ ఉప్పొంగి ప్రవహించడంతో గతంలో నిర్మించిన వంతెన ముంపునకు గురైంది. ఈ గ్రామాలకు నౌపడ ఆర్‌ఎస్‌, తలగాం నుంచి రహదారులు ఉన్నా యి. చిన్నపాటి వర్షం కురిసినా గెడ్డలోకి నీరు చేరి.. గ్రామాలు ముంపునకు గురవుతున్నా యి. నందిగాం మండలంలోని దిమిలాడ, నౌగాం ప్రాంతాలో నుంచి అధికంగా నీరువచ్చి గెడ్డలో చేరుతోంది. 40 ఏళ్లుగా ముంపు సమ స్య ఉన్నా అధికారులు, నాయకులు శాశ్వత పరిష్కారం చూపడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. వర్షాలు కురిసే వేళ బయటకు రావాలంటేనే భయమేస్తోం దని వాపోతున్నారు. వంతెన ఎత్తు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

  • మంత్రి అచ్చెన్న చొరవతోనైనా..

  • 2004లో అప్పటి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు సుమారు రూ.50 లక్షలు వెచ్చించి వంతెన నిర్మించారు. నౌపడ ఆర్‌ఎస్‌ నుంచి పెద్దరోకళ్లపల్లి పంచాయతీకి బీటీ రోడ్డు వేయించారు. కాగా, ప్రస్తుతం గెడ్డలో పూడిక పేరుకుపోవడంతో దిగువ ప్రాంతాలకు నీరు వెళ్లలేక.. వంతెన పైనుంచి ప్రవహిస్తోంది. దీంతో ముంపు సమస్య ఎదురవుతోంది. వంతెన కూడా శిథిలావస్థకు చేరుకుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరినా కనీసం పట్టించుకోలేదు. ఇటీవల మంత్రి అచ్చెన్న దృష్టికి ఈ సమస్య తీసుకెళ్లగా వంతెన నిర్మాణానికి అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఆయా గ్రామస్థులు ముంపు ముప్పు నుంచి తమ కష్టాలు తొలగనున్నాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

  • కూటమి ప్రభుత్వంపైనే ఆశలు

  • ముంపు సమస్యను పరిష్కరించాలని మా గ్రామాల ప్రజలు ఇటీవల మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్లాం. గెడ్డపై వంతెన ఎత్తు పెంచేందుకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో రహదారి సమస్య పరిష్కారమైంది. మళ్లీ వంతెన నిర్మాణం ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో జరుగుతుందని ఆశిస్తున్నాం.

  • - ధర్మారావు, సర్పంచ్‌, పెద్దరోకళ్లపల్లి

Updated Date - Nov 25 , 2025 | 12:04 AM