అనర్హులకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు
ABN , Publish Date - Aug 31 , 2025 | 12:03 AM
శ్రీజగన్నాథపురం గ్రామ కొండపై జగ నన్న కాలనీలో గత ప్రభుత్వం అన్హరులకు ఇళ్ల పట్టాలు మంజూ రు చేశారని, దీనిపై పూర్తి స్థాయిలో విచా రణ జరిపి అర్హులకు పట్టాలు ఇవ్వాలని పలువురు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును కోరారు.
మంత్రి అచ్చెన్నాయుడికి ఫిర్యాదు
కోటబొమ్మాళి, ఆగస్టు 30(ఆంధ్రజ్యో తి): శ్రీజగన్నాథపురం గ్రామ కొండపై జగ నన్న కాలనీలో గత ప్రభుత్వం అన్హరులకు ఇళ్ల పట్టాలు మంజూ రు చేశారని, దీనిపై పూర్తి స్థాయిలో విచా రణ జరిపి అర్హులకు పట్టాలు ఇవ్వాలని పలువురు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును కోరారు. శనివారం నిమ్మాడలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో శ్రీజగన్నాఽథపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు సాసు మహంతి ఆనంద్ ఫిర్యాదు చేశారు. దీనిపై మంత్రి వెంటనే స్పందించి టెక్కలి ఆర్డీవో ఎన్.కృష్ణమూర్తికి ఫోన్‌లో మాట్లాడి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని సూచించారు. మరింత కొంతమంది వివిధ సమస్యలపై వినతి పత్రాలు అందజే శారు. కార్యక్రమంలో మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్, టీడీపీ నాయకులు బోయిన రమేష్, వెలమల కామేశ్వరరావు, విజయలక్ష్మి తది తరులు పాల్గొన్నారు. అలాగే నిమ్మాడ గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయ కుడిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. సతీమణి, మాజీ సర్పంచ్ కింజరాపు మాధవితో కలిసి అన్నసమారాధనలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు కింజరాపు హరిప్రసాద్, టీడీపీ నాయకలు వెలమల కామేశ్వరరావు, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.