Share News

ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి

ABN , Publish Date - Aug 23 , 2025 | 12:07 AM

ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలను త్వరతంగా పూర్తి చేయాలని జడ్పీ సీఈవో శ్రీధర్‌ రాజా సూచించారు.

ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి
లబ్ధిదారులతో మాట్లాడుతున్న జడ్పీ సీఈవో శ్రీధర్‌రాజా

నరసన్నపేట, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలను త్వరతంగా పూర్తి చేయాలని జడ్పీ సీఈవో శ్రీధర్‌ రాజా సూచించారు. శుక్రవారం జమ్ము జగనన్న లేవుట్లలో ఇళ్లు నిర్మాణాలను ఆయన పరిశీలించారు. లేవుట్లలో శతశాతం ఇళ్లు నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. ఆరు లేవుట్లలో 527 మంది లబ్ధిదారులు ఇళ్లు నిర్మాణాలను పూర్తి చేయాల్సి ఉందన్నారు. ఇళ్లు నిర్మాణాలకు పొదుపు సంఘాల ద్వారా రుణాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కాలనీ వాసులు సీఈవోను కోరారు. ఎంపీడీవో వెంకటేష్‌ ప్రసాద్‌, గృహానిర్మాణశాఖ అధికారులు పాల్గొన్నారు. అలాగే కోమర్తిలో ఐవీఆర్‌ఎష్‌ కాల్స్‌పై అవగాహన కల్పించారు.

Updated Date - Aug 23 , 2025 | 12:07 AM